పాఠశాల పిల్లలు తమ పుస్తకాలను ఇష్టపడి చదవాలని, అప్పుడే వారికి చదువు బాగా వస్తుందని శ్రీరాంపూర్ మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ కోరారు. బుధవారం ఆయన కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ప్రార్ధన సమయానికంటే ముందే అక్కడికి చేరుకొని, పిల్లలతో ముచ్చటించారు. పాఠశాల పిల్లల చేత పాఠ్యపుస్తకాలను చదివించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అయిదో తరగతి పిల్లలకు తెలుగు వ్యాకరణాంశాలను బోధిస్తుండగా, ఎంఈఓ అతని బోధన శైలిని పరిశీలించారు. వివిధ రకాల వ్యాకరణ ప్రక్రియలను పిల్లలకు చక్కగా బోధిస్తున్న ఈర్ల సమ్మయ్యను ఆయన అభినందించారు.
ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకు చక్కని బోధనను అందిస్తూ, వారిని ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారని, ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు. సకల సౌకర్యాలతో పాటు చక్కని బోధననందిస్తున్న ఊషన్నపల్లి పాఠశాలలోనే పిల్లలందరినీ చేర్పించాలని ఎంఈఓ తల్లిదండ్రుల్ని కోరారు. అనంతరం ప్రీ ప్రైమరీ తరగతికి వెళ్లి, పిల్లల్ని పలు ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. పిల్లల చేత పాఠ్యాంశాలను చదివించారు. మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. వారికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, ఉపాధ్యాయినులు మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, విద్యార్థినీ, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి