వల్లాల ఆదర్శ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ప్రారంభం
 శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో ఈరోజు స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ను ప్రారంభించడం జరిగింది
ఈ యూనిట్ కు స్కౌట్స్ మాస్టర్ గా దామెర్ల కృష్ణయ్య, గైడ్స్ కెప్టెన్ గా బి శ్వేత నియామకం కావడం జరిగింది,
వీరి ఇద్దరి ఆధ్వర్యంలో వల్లాల ఆదర్శ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ను పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు ప్రారంభించారు, ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు
ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులకు చిన్నతనం నుంచే సామాజిక సేవా భావం, క్రమశిక్షణ ,అంకిత భావంతో ఎలా పనిచేయాలి అనే దృక్పథం ఏర్పడుతుంది అని స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపాధ్యాయులు దామెర్ల కృష్ణయ్య,బి శ్వేత తెలియజేశారు

కామెంట్‌లు