ప్రసవ వేదనపడి పుడమి పైకి మనల్ని తెచ్చి
పొత్తిళ్ళలో పెట్టుకు పరవశించి ముద్దాడి
రుధిరాన్ని చనుబాలుగా మార్చి
మురిసి అనురాగ ఆప్యాయతలను పంచి
మలమూత్రాదులను తుడిచి పసిడిబొమ్మలా తయారుచేసిన
మాతృమూర్తి పరదేవతా స్వరూపమే.
చినిగిన బట్టలు తాను తొడిగికొని పండుగకు క్రొత్తబట్టలు కొని ఇచ్చి
కఠినంగా ఉన్నా నీ ఉన్నతికై పాటుపడిన పరమేశ్వర ప్రతిరూపమే పితృదేవులు.
తాతయ్య నానమ్మల ప్రేమానురాగాలు
నులకమంచం మీద వెన్నెల్లో డెబ్బది సంవత్సరాల వయస్సులో
చెప్పిన వేమన సుమతీ శతకాలు
రామాయణ మహాభారత గాధలు
మంచి చెడులను అనుభవంతో చెప్పే వృద్ధులు
'పెద్దల మాట చద్దిమూట' అన్నది అక్షర సత్యమే
వృద్ధాప్యంలో ఒక చిన్న ఆప్యాయత పలకరింపుతో
పరవశించి బోసి నోటితో
'దీర్ఘాయుష్మాన్ భవ
దీర్ఘ సుమంగళీ భవ' అని
తమ ఆయుష్షు కూడా పోసుకు బ్రతకమని
ఆశీర్వదించే వృద్ధులు
సనాతన ధర్మంలో
'మాతృదేవోభవ
పితృదేవో భవ
ఆచార్య దేవో భవ
అతిధి దేవోభవ' అన్నది
ఆచరిద్దాం
వృద్ధుల పరిరక్షణ మన బాధ్యత
వృద్దాశ్రమాలు వద్దు
ఉమ్మడి కుటుంబాలు ముద్దు అని
వారి అడుగుజాడల్లో నడుద్దాం
వృద్ధులే ఆదర్శ జీవనానికి సోపానాలు అని
వసుదైకానికి చాటుదాం...!!
...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి