ఆతుకూరి మొల్ల: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
కుమ్మరి వంశాన జన్మించి
శ్రీరాముని మించిన దైవము
ఇలలో లేడని వాల్మీకి రామాయణాన్ని 
తేట తెలుగు కంద పద్యాలలో రచయించిన క
వియత్రి మొల్ల మీ కివే శతకోటి వందనములు....!!

సహజ పాండిత్యముచే
సరస్వతీ మాత అనుగ్రహముతో
ధనము, కీర్తిని ఆశించక
ఆరు కాండలలో ఎనిమిది వందల డెబ్బది(870) 
పద్యాలతో  పండితులకు, పామరులకు అర్ధమైన
తేట తెలుగు కంద పద్యాలలో రచియించిన
'కంద రామాయణం'గా
వినుతకెక్కి ధర్మానికి ప్రతిరూపమైన 
శ్రీరామచంద్రునికే అంకిత మిచ్చిన కావ్య శిరోమణి
ఆతుకూరి మొల్ల మీరు
కారణ జన్ములు .
అందుకోండి మీకివే
మా శతకోటి వందనములు...!!
...........................


కామెంట్‌లు