సుప్రభాత కవిత : - బృంద
చీకటిని స్వాగతిస్తేనే 
తారలు కనపడతాయి 
రేపటిని కోరుకుంటేనే 
దారులు తెరుచుకుంటాయి

కాలం నీతో కలిసి రాదు 
కాలాన్ని నీవే కలుపుకు పోవాలి 
కలతలు నీకు చెప్పి రావు 
కన్నీళ్లు  తుడుచుకుని సాగిపోవాలి

సాయం ఎవరూ లేరని 
సందేహం అసలొద్దు 
సహకరించడానికీ 
పరిచయమే అవసరంలేదు

అనుకున్నది జరగలేదని 
తల్లడిల్లి  పోనవసరంలేదు 
నీకు తగిన ప్రతిఫలం 
నీకోసం కాచుకునే ఉంటుంది

ప్రోత్సాహం  దొరకలేదని 
ప్రయత్నం మానుకోకు 
ఆశించని చోటునుండి 
ఆదరణ దొరకుతుంది

వేసే ప్రతి అడుగు ముందే 
నిర్ణయించబడ్డది...
మనకు తెలియని చెయ్యేదో 
మనలను ఆడిస్తోంది....

అన్నీ తెలుసనుకునే అజ్ఞానం
అంతా నేనే అన్న అహంతో 
అలికిడి లేక వచ్చే ఆపదలు 
అర్థం  అవక అల్లాడే  బ్రతుకులకు 

మరో అవకాశంలా వచ్చే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు