ప్రపంచవ్యాప్తంగా మార్చి 20 తేదీని పిచ్చుకల దినోత్సవం గా నిర్వహించుకుంటారు. బక్రి చెప్యాల ఉన్నత పాఠశాలలో ఎకో క్లబ్ ఆధ్వర్యం లో పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దారం నాగేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు మామిడి పూర్ణ చందర్ రావు,సుహాసిని,శ్రీశైలం,రమాదేవి, లక్ష్మయ్య , శ్రీనివాస్,యాదమ్మ గార్లు పాల్గొన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రారంభోపన్యాసం చేశారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పూర్ణ చందర్ రావు మాట్లాడుతూ, బాధ్యతగల భావి పౌరులుగా విద్యార్థులు పిచ్చుకల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలను సూచించారు. పిచ్చుకలు జీవవైవిద్యాన్ని పెంపొందిస్తూ సహజ కీటక నివారిణులుగా పర్యావరణ సమతుల్యతకు ఇతోదికంగా తోడ్పడుతున్నాయని వివరించారు. పట్టణీకరణ , రసాయన పురుగుమందుల వల్ల, మరియు సెల్ టవర్ల నుండి వెలువడడే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ వల్ల పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని వివరించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడే బాధ్యత గల విద్యార్థులుగా పిచ్చుకల సంరక్షణ కొరకు ప్రత్యేకంగా ఈ వేసవికాలంలో నీటి తొట్లను, గింజలను వేస్తూ , పండనిచ్చే మొక్కల పెంపకం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీని నిర్వహించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రి చెప్యాల లో ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి