****
అయినా అవ్వా! కొంత మందిరి ఎన్ని పోటురాళ్ళు తగిలి ఎదురు దెబ్బులు తిన్నా కూసింతైన మార్పు రాదా? మా పోబడి గిదే అన్కుంట గట్లనే కాలం ఎల్లదీసిండ్రు.
"గిప్పుడేమో ఏం జెయ్యాలె ఎట్ల సమస్స నుంచి గట్టెక్కాలె? అన్కుంట తలకాయ బట్టుకుంటే ఏం లాబం శెప్పు.
"నిజమే శెల్లే!గియ్యాల తిన్నది ఉన్నది కాదు గద మడిషికి.ఇంట్లెకెవ్వలు జొరబడకుండ గడి ఏత్తం.రచ్చనగ దడి గట్టుకుంటం. ఎల్లాపి శెకల్లెక్క ఇంటిని వొదిలెయ్యం గద.గట్లనే ముందు జాగర్త సుత ఉండాలె. గదే బవిషత్తుకు రచ్చన అవుతుంది శెల్లె!"
గందుకే గిదిన్నంక నా శిన్నప్పుడు జేజవ్వ శెప్పిన కత మతిలకి వొచ్చింది."
"కతనా అవ్వా! కతనా! మేం సుత ఇంటం "ఒరేయ్ బుడ్డోడా! జెర ఎల్లెం రారా!'' అవ్వ కత శెప్తాంది" గట్టిగ తమ్ముణ్ణి పిల్శింది భూలచ్మి.
ఎన్కట ఓ గొల్లభామ,ఓ శీమ పక్క పక్క ఇండ్లల్ల ఉండేటియి. శీమ ఎప్పుడు జూశినా ఏదో ఒకటి జేస్కుంట ఉండేది. ఏ శీకూ శింత లేకుండ తిరిగే గొల్లభామ శీమను బట్కొని "ఎప్పుడూ పనేనా? నేన్జూడు ఆడుకుంట పాడుకుంట ఎంతాయిగా బత్కుతున్ననో!. నువ్వేంది సచ్చే శాకిరి శేత్తనే ఉంటవు.ఇంగ నన్న నన్ను జూసి మారు. దేనికైనా పెట్టి పుట్టాలె నా లెక్క అందట."
"గా గొల్లభామ మాటల్కి! శీమ "నేను గిప్పుడు ఆడ్కుంట పాడ్కుంట నీ లెక్క ఉంటే వొచ్చే వానాకాలం నేను నా పిల్లగాండ్లు కడ్పు మాడి సావాల్సొత్తది." అంది."
"నీకు సుఖ పడే రాత లేదు తీ అన్కుంఠ బోయింది గొల్లభామ..."
దినాలు గడ్శినయయి. ఆనా కాలం వొచ్చింది. గూట్లె నుంచి గింతన్న కదలకుండ పిల్లగాండ్లకి ఇగ్గో నా లెక్కనే కతలు కాకరకాయలు శెప్పుకుంట శీమ ఆనందంగా ఉంది."
"అయితే గా గొల్లభామ ఏం జేసిందవ్వా? బుడ్డోడు అవ్వ చెప్పేదాన్క సుత ఆగకుండా అడిగిండు.
"అవ్వ నగుకుంట గా సంగతి కాడికే వొత్తున్న అని గా గొల్లభామ సంగతి జెప్పింది."
ఎప్పట్లెక్క ఆడుకుంట పాడుకుంట ఉందామంటే వొచ్చింది ఆనా కాలమాయె. గూట్లె నుంచి కాలవతల్కి పెట్టేట్టు లేదు.తిండి గింజలు దాస్కోలేదు. దాంతో ఏం జెయ్యాలో తెల్వక ఆకలికి నకనకలాడాల్సొచ్చింది.
గందుకే ఇంటికి దడి,గడి ఎట్ల రచ్చనో మనిషికి ముందు సూపు రచ్చన.గవి లేకుండా నిర్లచ్చంగ బత్కితే ఆటెంక గిట్ల అవత్తలు పడాల్శి వొత్తుంది. గీ కత ఎప్పుడూ మతిలకి పెట్టుకోవాలె.శీమ లెక్క బత్కాలె.గప్పుడే శీకూ శింత లేకుండ ఆయిగుండొచ్చు "
అనంగనే భూలచ్మి, బుడ్డోడు ఇద్దరొక్కసారె"బల్లె పంతులమ్మలు సార్లు జెప్పిన పాఠాలు సుత ఎప్పటికప్పుడే సద్వుకుంటే పరీచ్చలప్పుడు ఏం బయం లేకుండా శీకూ శింతా లేకుండా రాయొచ్చు కదవ్వా! అన్నరు."
పిల్లలిద్దరూ" ఆ ఇంటికి దడి లేదు ఈ ఇంటికి గడి లేదు" సామెత కతని సద్వు,పరీచ్చల దృట్టిలో సూడ్డం శానా శానా నచ్చింది అవ్వకి.
గదండీ సంగతి ఆ ఇంటికి దడి లేదు ఈ ఇంటికి గడి లేదు అంటే గిదే మరి. ఓ పద్ధతి లేదు,బవిషత్తు జాగర్త లేదు. శేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్టు సేశేటోళ్ళ పరిత్తితి గొల్లభామ బత్కు లెక్క అయితదని అర్తం గిందుల దాగి ఉంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి