చూ సీ... చూ డ న ట్టు: - కోరాడ నరసింహా రావు
చెడును చూ డ కు....! 
   చెడును చూసి... 
  చూ డ న ట్టు కళ్లుమూ సు కోకు...!! 

అసలే న్యాయానికి కళ్లు లేవు...! 
 వినటమే గానీ చూడ లేదు...!! 

చూసిన కన్ను, చెప్పే నోరు వినే చెవి.... 
  వీ టి కి  సమన్వయం ఎప్పుడూ లోపించ కూడదు...! 

చూసినది చూసి నట్టు ... 
 ఉన్నది ఉన్నట్టే చెప్పాలి! 
  విన్నది ఔనా... కాదా..., 
 యోచించాల్సింది బుద్ది..!! 

దీనికి పక్ష పాతము ఉండ కూడదు...! 

వాదించే నోళ్లు ఏ కొమ్మైన కాయొచ్చు ... గానీ.., 
  తీర్పు చెప్పే నోరు... ఈ రెండు పక్షాలు కాక... 
  మూడో పక్షము... అంటె
  ధర్మ పక్షము ... అదే
 సత్యం వైపే నిల బడాలి!! 

అందుకే... మనమెప్పుడు
పరదాల వెనక బ్రతక కూ డదు...! 
  పరదాలంటే.... ఎవరూ చూ డ కూ డ దు... ఎవరికి తెలియ కూ డ దు అనేగా...! 
   అంటే... మనం తప్పు చేస్తున్నామని మన అంత రాత్మ చెబుతున్నా... 
  దాని నోరు నొక్కి...మరీ తప్పు చేస్తున్నామన్న మాట..!! 

నిజాయతీ వానికి మరణం ఒకే సారి... 
  గానీ దగుల్బాజీ అనుక్షణము చస్తూనే వుం టాడు...!! 

అటువంటి వారికి మనం అవకాశము ఇవ్వ కూడ దుగా....! 

అందుకే... చెడును చూ డ కు... 
  ఒక వేళ చూసావా..., చూడనట్టు కళ్లు మూసుకోకు...!! 
     *****

కామెంట్‌లు