మహిళ: -కోరాడ !
మహి.... ఇల ....! 
 ఈ భూమిపై, మానవ జీ వన సర్వస్వము మహిళ యే....!! 

ఆకాశము సృష్టికి మూలము...! 
 ఆ ఆకాశములో సగం స్త్రీ

ఈ సృష్టి కి సగం బాధ్యు రాలు స్త్రీ యే...! 
  బిడ్డలకు జన్మ నివ్వటమే కాదు, పాలివ్వటం తో మొదలు పెట్టి...తన అమూల్యమైనసేవలతో పెంచి, పెద్దచెయ్యటమే కాకుండా...., 
  అక్కగా, చెల్లిగా, వదిన గా ,పిన్నిగా...., 
 అనేక రూపాలలో  తన అనుపమాన ప్రేమాభిమానాలతో పాటు 
 భార్యగా పురుషునిలో సగమై...ఇంటా, బయట ఎనలేని సేవల నందిస్టూ బాధ్యతలు నిర్వర్తించు టే గాని,హక్కుల నాసించని మహిళలను ... అలుసుగా అణగ ద్రొక్కే పురుష పుంగవు లారా....!
ఇలపై సర్వము తానెయైన మహిళ యే    ఈ ఇలపై ఆది శక్తి...! 

ఆ శక్తి తోడుగా ఉన్నంత వరకే... ఈ మగాడు పురుషుడు...! 
  లేకుంటే...శ వ సమానుడే....!! 
      *******


కామెంట్‌లు