యునెస్కో క్రియేటివ్ కల్చరల్ వింగ్ మహిళా ప్రెసిడెంట్ గా డా. ధనాశి ఉషారాణి

 చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి ఉషోదయ సేవా ఫౌండేషన్  అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణికి  అంతర్జాతీయ గుర్తింపు పొందినట్టి యునెస్కో లో అసోసియేషన్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీ వారు రచయిత్రిగా నూతన ప్రక్రియలు రూపకర్తగా చేసిన సేవలకుగాను సాహిత్యంలో వందల సంఖ్యలో పోగ్రామ్స్ చేసినందుకుగాను విశేష జనాదరణ పొందినట్టి సేవకురాలుగాను చేసిన సేవలకు గుర్తింపుగాను  సింగింగ్లోను విశిష్ట ప్రతిభను కనపరుస్తూ ఎన్నో సెమినారు కార్యక్రమాల్లో పాల్గొంటూనే  విధ్య రంగములో ఉన్నత స్థాయి చదువులను చదువుతూనే చేస్తున్న సాహితీ యజ్ఞాన్నికి ప్రతీకగా యునెస్కో క్లబ్ లో క్రియేటివ్ కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ గానియమిస్తున్నట్టు యునెస్కో  క్లబ్ ఆఫ్ గుంటూరు  రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ ఇండియా మరియు ప్రెసిడెంట్ పరమేశ్వర రావు రామనాథo గారు ప్రకటించడం జరిగింది. విజయవాడలో  9 తేదీ జరిగే  కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో జాతీయ ఉత్తమ మహిళా పురస్కారం నారీ శక్తి సమాన్ అందుకొనున్నారు. పలువురు సాహితీ అభిమానులు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు