మా అమెరికా అనుభవాలు..: - పోణంగి బాల భాస్కర్
 Alfaretta లోని HMT మితృడు ప్రదీప్ కుమార్ కుమార్తె ఇంటినుంచి 23 మర్చి 2018 శుక్రవారం రాత్రి Alabama లోని HMT మితృడు ఆనందకుమార్ కుమార్తె ఇంటికి వచ్చాము.
ఈ రోజు 2018 మార్చి 24 వ తేది ఉదయం Hoover లో రెండు కమ్యూనిటీలలో ఓ గంట మార్నింగ్ వాక్ చేశాను.  నడుస్తూ అటు ఇటు ఫొటోలు తీశాను. 
The WOODS of Hoover మరియు The FALLS of Hoover అనే జంట కాలనీలు తీర్చిదిద్దినట్లు ముచ్చటగా ఉన్నాయి.   ఒకొక్క అపార్ట్మెంటుకీ 100, 200, 300 అంటూ నెంబర్లు ఇచ్చారు.  ఒక్కో apartment లో 10 నుంచి 16  flats ఉన్నాయి. Maintenance లో భాగంగా ఆరుబయలు నేలమీద తేమను కాపాడటం కోసం ఎండుగడ్డి తో చేసిన Rolls ను ఉపయోగించి పలుచగా పరుస్తారు.
main gate దగ్గర ఏర్పాటు చేసిన water fall ఎంతో ఆకర్షణీయంగా ఉంది.  అదీ సంగతి. ఇప్పుడు ఇక్కడ ఒక గృహప్రవేశానికి వెళ్తున్నాము.
🌸🌷🌸




కామెంట్‌లు