అనంత సాగర్ లో ఉగాది బాల కవి సమ్మేళనం

 తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వ దిన సందర్భంగా బుధవారం    సిద్దిపేట జిల్లా  చిన్న కోడూరు మండలం లోని అనంత సాగర్ ఉన్నత పాఠశాలలో  బాల కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఇందులో 20 మంది విద్యార్థులు పాల్గొని తమ కవితలు వినిపించారు. అరవై సంవత్సరాల పేర్లు విద్యార్థులు చదివి వినిపించారు.అనంతరం తెలుగు ఉపాధ్యాయులు కోణం పర్షరాములు పంచాంగ శ్రవణం చేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి,సమ్మయ్య,కవిత,దుర్గయ్య, పర్షరాములు,శ్రీమతి లు పాల్గొన్నారు.
కామెంట్‌లు