*ఇలాగే వుంచు... పచ్చ దనాన్ని పంచు..! *: - కోరాడ నరసింహా రావు
చెట్టు కొమ్మ రెమ్మల ఆకుల తో.... 
  స్నేహించి చేయి కలిపితేనే... 
  ఈ మనిషికి మనుగడ! 

అవి ఎంత పచ్చగా వుంటే 
 మనిషి బ్రతుకుకు అంత వెచ్చదనము... 
    ఏ దీ... దీనికి మించిన ధనము....!? 

మన మెన్ని కోట్లు కూడ బెట్టా మన్నది కాదు.... 
  ఈ నేలకు ఎంత పచ్చ దనాన్ని పంచా మన్నదే ముఖ్యం....! 

ఇదే... ఈ పచ్చ దనమే రేపటి తరాలకు మన మిచ్చే మూల  ధనం... 
  మనమిచ్చే ఇళ్లు,డబ్బు, బంగారము ,ఇవికావు ఆస్తులు....!! 

ఈ ఆహ్లాదకర ప్రకృతికి నువ్వేమీ ఇవ్వనక్కర లేదు.... 
  తాను నీ కిస్తున్న ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేసుకో కుండా వుండు చాలు...!! 

నీ అత్యాశకు అతి తెలివి తేటలను జోడించి... 
  నీ విజ్ఞాన వికారాలతో ప్రకృతి అందాన్ని నాశనం చెయ్యకు. ... 
    నీ వినాశాన్ని నువ్వే కోరి కొని తెచ్చుకోకు... 
  నీ ఈ స్నేహ హస్తాన్ని ఇలాగే వుంచు... కొనసాగించు... 
  పదికాలాలు నువు పచ్చ గా వుండు...! 
   నీ వారసులకు ఈ పచ్చ దనాన్ని పంచు...!! 
       *****


కామెంట్‌లు