ఓ మహిళ నీకు వందనం; - -ఎస్.వి.రమణా చార్య
స్త్రీ అంటే బలహీనత కాదు…
సృష్టిని నిలబెట్టే శక్తి.
స్త్రీ అంటే ఆధారం మాత్రమే కాదు…సమాజాన్ని ముందుకు నడిపే మార్గదర్శి. వేల ఏళ్ల క్రితమే సనాతన ధర్మం చెప్పింది—
“యత్ర నార్యస్తు పూజ్యంతే… రమంతే తత్ర దేవతాః.”
అంటే మహిళను గౌరవించే చోటే దేవతలు నివసిస్తారని.
పార్వతి ధైర్యం…
లక్ష్మి ఐశ్వర్యం…
సరస్వతి జ్ఞానం…
ఈ మూడు శక్తులు కలిసిన రూపమే భారతీయ మహిళ.
ఈ రోజు ఆమె
ఇల్లు నడిపే గృహిణి…
జ్ఞానం పంచే గురువు…
దేశాన్ని ముందుకు నడిపే నాయకురాలు.
అందుకే ప్రతి సంవత్సరం జరుపుకునే International Women's Day ఒక రోజు వేడుక మాత్రమే కాదు…
మహిళ శక్తికి సమాజం ఇచ్చే గౌరవ వందనం.
🌹స్త్రీని గౌరవిస్తే సంస్కృతి నిలుస్తుంది.
🌹స్త్రీకి అవకాశం ఇస్తే సమాజం ఎదుగుతుంది.
🌹స్త్రీ ముందడుగు వేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది.
 Happy Women’s Day – మహిళా శక్తికి వందనం!🙏🏼
మీ
-ఎస్.వి.రమణా చార్య

కామెంట్‌లు