పరిగెత్తే ప్రవాహం
ఆగి చూసే అద్భుతం...
విరిసే చిన్ని పువ్వూ
వేచి చూచే ప్రభాతం
అంగరంగ వైభవంగా
రంగవల్లులు దిద్ది
నారింజరంగు హారతి తో
నింగి దారులు సిద్ధం
మౌనంగా తల ఊచు
తరువుల వందనం
గంభీరంగా నిలుచున్న
గిరి శిఖర నిరీక్షణం
కరుగుతున్న తుహిన
కళికల కదలికలు
జరుగుతున్న హిమశిలల
స్థాన చలనాలు
పచ్చిక చీరను చుట్టిన
పుడమి కన్య సోయగం
వెచ్చగా తాకి పలకరించు
తొలి దినకర మయూఖం
హృదయము నిండుగా
ఉల్లాసము నింపగా
ఇనుడి రాకతోనే
ఇలకు వచ్చు పండుగకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి