అభద్రతా భావ బ్రతుకుల్లోభద్రత కోసం మనిషి ఆరాటపు పోరాటం...!
ఇది ఆది మానవునిలో మొదలై...
నేటి ఆధునిక మానవు నైనా వదలలేదు ,
సరికదా... మరింత పెంచింది...!!
ఆనాడు... కేవలం క్రూర మృగాల నుండే భయం...
గాని నేడు...!
పీల్చే గాలి...త్రాగే నీరు, తినే తిండి...తిరిగే రోడ్లు...
చేసుకునే పని... అన్నింట
ప్రతిఛోట , ప్రతి క్షణ0.... అభద్రతా భయమే....!!
వేసే ప్రతి అడుగును...
ఆచి తూచి వెయ్యాల్సిందే
ఏ క్షణ0 యేమారినా...
ఏ మై పోతామో ...!!
అ0దుకే... స్వీయ రక్షణ కవచాలను వినియో గిం చుకో వలసిందే...!
వాహనాలలో వెళ్ళేటప్పు డు హెల్మెట్లు, సీటు బెల్టు లు లాంటివి....
హనాలు నడిపేటపుడు త్రాగటం
ఓవర్స్పీడు , సిగ్నల్సు... కర్మా గారాలలో పని చేసే టపుడు వేసుకో వలసిన భద్రతా పరికరరాల
తీసుకో వలసిన జాగ్రతలన్నీ తప్పని సరిగా పాటించా లిసిందే...!!
అంతెందుకు ... మన పరిసరాలు , వినిమయ వస్తువులు...
ప్రతి విషయం లోనూ జాగ్రతలు తప్పని సరి...
ఈ అభద్రతా సమాజం లో బ్రతుకు తున్న0దుకు ఇన్ని పాట్లూ ప డాల్సిందే !
లేకుంటే... మనుగడ దుర్భరమో.... మరణము తధ్యమో...!
******
స్వీయ రక్షణ : - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి