రేసు :- డా ప్రతాప్ కౌటిళ్యా.
ఆడవాళ్లు చవటలని 
చవటలు అంటుంటారు.
ఆడవాళ్లపై ఆధారపడేవాళ్లు 
చవటలని చవటలంటుంటారు. 

రేసులేన్నో గెలిచి నిలిచిన 
జాతుల్లా
రేసులెన్నో గెలిచి 
నిలిచిన మహిళలు 
ఆడ మగ రేసును కూడా 
గెలిచారు 
మకుటం లేని మహారాణులు 
వాళ్లు. 

పాలిచ్చి పెంచే తల్లులే కాదు 
పాలించే రాణులు కూడా వాళ్ళు.
మగవాళ్లు సంపాదిస్తే 
ఆడవాళ్లు ఆధారపడవచ్చు కానీ 
ఆడవాళ్లు సంపాదిస్తే 
మగవాళ్లు ఆధారపడకూడదు 
మగవాడే మొనగాడనేందుకే 
చవటల మాటలు ఇవి
అసలు ఆడ మగ తేడా లేదనేది ఎవరు 
మహిళలు. 

అవకాశాన్ని అవసరాన్ని బట్టి 
మగాడు ఆడవాళ్లపై ఆధారపడితే 
ఆకాశమేమి కింద పడదు. 
మగాడు మొనగాడు కాకుండా పోడు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు