పట్టుకుందామని ప్రయత్నిస్తుంటే
ఏ పడతీ ప్రసన్నమవటంలే!
ముట్టుకుందామని మురిసిపోతుంటే
ఏ మగువా ముందుకురావటంలే!
కట్టుకుందామని కాంక్షిస్తుంటే
ఏ కాంతా కలసిరావటంలే!
మాంగళ్యధారణకు ముహూర్తంపెడతానంటే
ఏ మహిళా మెడవంచటంలే!
లాలిస్తానని లేపుతుంటే
ఏ లలన లొంగటంలే!
భరిస్తానని భరోసా ఇస్తుంటే
ఏ భామా భుజాలెత్తటంలే!
సహజీవనం చేద్దామంటే
సరసాలకు చెంతకురమ్మంటే
ఏ సుందరి సిద్ధపడటంలే!
పట్టుచీరెలిస్తా పక్కకురమ్మంటే
ఏ పయ్యెద పుచ్చుకోవటంలే!
బంగారునగలిస్తా బాగాతయారవ్వమ్మంటే
ఏ భామా బుట్టలోపడటంలే!
వలలో వేసుకుందామనుకుంటే
ఏ వనితా చిక్కటంలే!
స్వర్గం చూపిస్తానంటే
ఏ సుమతీ నమ్మటంలే!
అబలలతరం అంతమైంది
సబలలతరం సాగుతోంది
అతివలతరం ఆరంభమైంది
రమణులతరం రాజ్యమేలుతోంది!
============================
💐💐💐💐🌹🌹🌹🌹సమాజ నిర్మాణంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషిస్తున్న మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు💐💐💐💐🌹🌹🌹🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి