పాఠశాల అభివృద్ధికి తోర్పడుదాం
 తొట్టంబేడు:మండలం లో శనివారం దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రమణ్యం ఒకరోజు ముందస్తుగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పాఠశాల అభివృ ద్ధికి భాగస్వాములవుతున్న మహిళలు ఆయా, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు, అంగన్ వాడి కార్యకర్తలను ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ పాఠశాల ఒక ఉమ్మడి కుటుంబం లాంటిదని విద్యాభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో మాధవి,పద్మ,మోహన్ రాణి,జయరత్న,పాఠశాల విద్యా కమిటీచైర్మెన్ కల్పన,విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్థులు 

పాల్గొన్నారు.
కామెంట్‌లు