క్యారెట్, కొన్ని సంగతులు: - - యామిజాల జగదీశ్

 టైప్ 2 డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగండి. దీంతో టైప్ 2 డ‌యాబెటిస్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే టైప్ 2 డ‌యాబెటిస్ నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ పరిశోధకులు చెబుతున్నారు.
కూరగాయలలో తియ్యటిది క్యారెట్. ఈ క్యారెట్‌లో ఉన్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతం మంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చిగా తినడానికి ఇష్టపడతారే కానీ, వండితే మాత్రం ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయి. ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు మాట. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపం లోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకు న్నట్ల యితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. 
విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యం గల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే పరిమాణములో క్యారెట్ విటమిన్ బి, సి, జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది. అతి ఉత్తమమైన, సహజమైన కాల్షియం (సున్నం) చక్కటి సమతౌల్యాన్ని అద్భుతంగా ఇది ఇవ్వగలదు. ఇది మంచి పటిష్టమైన పళ్ళకూ ఎముకలకు, మంచి చర్మానికీ కావలసిన అత్యావశ్యకమైన పదార్ధం. అంతేకాదు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్‌ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్‌ రసం తోడ్పడుతుంది. శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్‌ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్‌ జ్యూస్‌ తప్పక సేవించాలి.  క్యారెట్టులో విటమిన్ ఏ, బీ, ఈ - తోపాటు పలు మినరల్స్ ఉండటం మూలాన కళ్ళల్లో సాధారణంగా ఏర్పడే హ్రస్వ దృష్టి, దూరదృష్టి లోపాలను సరిదిద్దుకోవచ్చు. క్యారెట్ల‌లో ఉండే బీటా కెరోటిన్‌ను మ‌న శ‌రీరం విట‌మిన్ ఎ కింద మార్చుకుంటుంది. ఈ విట‌మిన్ ఎ ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌ద్వారా ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు స‌మ‌తుల్య‌మ‌వుతాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అందువ‌ల్ల నిత్యం క్యారెట్ జ్యూస్ తాగాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే క్యారెట్ల‌లో పిండి పదార్థాలు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ అవి షుగ‌ర్ ను పెంచ‌వ‌ని, అందువ‌ల్ల ఇబ్బంది ఏమీ ఉండ‌ద‌ని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే టైప్ 2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచ‌వ‌చ్చు.
క్యారెట్లకు వైవిధ్యభరితమైన చరిత్ర ఉంది
క్యారెట్లు ఇరాన్ దేశానికి చెందినవి. 10 వ శతాబ్దంలో ఆసియాలో మొదటిసారిగా సాగులోకి వచ్చాయి. సహజంగా పసుపు లేదా ఊదా రంగులో ఉండే ఈ దుంప, క్రమంగా ఆసియా ప్రాంతాలలో ఒక సాధారణ ఆహార పదార్థంగా మారింది.
యూరప్‌లో క్యారెట్లను మొట్టమొదట 12వ  శతాబ్దంలోనే తినడం మొదలుపెట్టారు. కానీ ఆ సమయంలో పార్స్‌నిప్‌లను ఇంకా విస్తృతంగా తింటున్నందున, వాటిని చాలా పరిమితంగానే తినేవారు. 
ఈ రోజు మనకు బాగా తెలిసిన నారింజ రంగు క్యారెట్లు 17వ  శతాబ్దంలో మాత్రమే ఉద్భవించాయి. 
డచ్ వారు ఒక సాంస్కృతిక ఎంపిక ప్రక్రియను అనుసరించి వీటిని ఉత్పత్తి చేశారు. అవి త్వరలోనే ప్రాచుర్యం పొందాయి, ఆ తర్వాత యూరోపియన్ వలసవాదం ఈ దుంపను అమెరికా ఖండానికి పరిచయం చేసింది. 
ఈనాడు, నారింజ రంగు క్యారెట్లు ఇప్పటికీ అత్యంత ప్రాచుర్యం పొందినప్పటికీ, పాతకాలపు కూరగాయలు మళ్లీ ప్రాచుర్యం పొందుతున్నాయి, గతకాలపు పసుపు లేదా ఊదా రంగు క్యారెట్లను మన భోజన బల్లలపైకి తిరిగి తీసుకువస్తున్నాయి.
క్యారెట్లను మూడు విధాలుగా సాగు చేస్తారు : విడివిడి మడులలో , ఎత్తైన దిబ్బలలో లేదా నేరుగా నేలలో. విత్తనాలు నాటినప్పటి నుండి పంట కోత వరకు క్యారెట్లు పెరగడానికి రెండు నుండి మూడు నెలల సమయం పడుతుంది. దీనికి ఇసుకతో కూడిన సారవంతమైన నేల, పొడి, చల్లని వాతావరణం, అలాగే మెరుగైన నీటిపారుదల అవసరం.
దున్ని, తిరగవేసి, గాలి తగిలేలా చేసిన మట్టిలో నారుమొక్కలను నాటాలి. వాటి మధ్య దూరం, మొక్కలు పరిపక్వతకు చేరినప్పుడు వాటి ఆకారాన్ని, పరిమాణాన్ని, రంగును నిర్ణయిస్తుంది. తగినంత స్థలం వేర్లు అభివృద్ధి చెందడానికి, అధిక మొత్తంలో పోషకాలను నిల్వ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. గరిష్ట ఉత్పత్తి కోసం, క్యారెట్లను పంట మార్పిడి పద్ధతిలో సాగు చేస్తారు, అంటే మరొక తినదగిన కూరగాయతో మార్చి మార్చి నాటుతారు.
ఈ దుంప కూరగాయ పెరుగుదలను నిర్ధారించడానికి వ్యాధులు, పరాన్నజీవులు, తెగుళ్ళకు వ్యతిరేకంగా అనేక రకాల నివారణ పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు, క్రమం తప్పకుండా కలుపు తీయడం (స్టీమ్ లేదా చేతితో) కలుపు మొక్కలను, గత పంటల అవశేషాలను తొలగిస్తుంది, తద్వారా కీటకాలను తరిమివేస్తుంది.
క్యారెట్ల వేర్లు భూమి ఉపరితలం పైకి వచ్చి, ఆకుపచ్చని ఆకులు పూర్తిగా పెరిగినప్పుడు అవి కోతకు సిద్ధంగా ఉంటాయి. భూగర్భ దుంప కూరగాయ అయినందున, క్యారెట్లను ఎక్కువ కాలం భూమిలోపలే , ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా నిల్వ చేయవచ్చు . అందువల్ల, అవసరమైనప్పుడు వాటిని (యంత్రాలతో లేదా చేతితో) కోయవచ్చు.
క్యారెట్లు అపియేసియే కుటుంబానికి చెందినవి. వాటి కాండాలు సుమారు 30 సెం.మీ. పొడవు ఉండి, చిన్న తెల్లని పువ్వులను కలిగి ఉంటాయి. ఇవి రెండేళ్లకు ఒకసారి పెరిగే మొక్కలు , నెమ్మదిగా పెరుగుతాయి. 500 కంటే ఎక్కువ రకాల్లో లభిస్తాయి .
క్యారెట్లు సర్వసాధారణంగా తినే శీతాకాలపు కూరగాయలలో ఒకటి, అయినప్పటికీ అవి సహజ రూపంలోనూ, ప్రాసెస్ చేసిన రూపంలోనూ (తురిమినవి, ముందుగా వండినవి, డబ్బాలలో నిల్వ చేసినవి, గడ్డకట్టించినవి మొదలైనవి) ఏడాది పొడవునా మార్కెట్లలో లభిస్తాయి.

కామెంట్‌లు