సుప్రభాత కవిత : - బృంద
శ్వాసనంతా  పరచుకున్న 
విశాల విశ్వపు  అంచున 
అప్పుడే విచ్చిన పువ్వులా 
కాంతిపుంజమొకటి......

నెమ్మదిగా ఎదుగుతూ 
రంగులు మార్చుకుంటూ 
వెలుగులు చిమ్ముకుంటూ 
జగతిని చూసే వేళ...

మొన్నటికన్నా నిన్న 
నిన్నటికన్నా నేడు 
మిన్నగా ఉండాలని 
ఎన్నో కలలు కనే మనసులకు 

కొత్త దారులు చూపిస్తూ 
కొత్త పుంతలు తొక్కిస్తూ 
కొత్త మలుపులు ఏవో 
పరిచయం చేయాలని....

ఎత్తుకు ఎదిగే క్రమంలో 
ఎక్కువ ఒత్తిళ్ళు లేక 
మిక్కిలి సంతృప్తి కలిగేలా 
పక్కనే ఉండి నడిపించాలని

నడిచే దారిలో ఎదురయే 
మాయల జోలికి పోనీక 
చేయి పట్టుకుని నడిపే 
తండ్రి తీరున రక్షించాలని 

వినతులతో వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు