తొలి దేవుని రాకతో
తెలి వెలుగులో తడిసి
స్వర్ణ రేణువులై మెరిసి
మురిసె సైకత తీరంలో
పరుగులు పెడుతూ చేరి
పదములు ముద్దాడి
పరవశించి పొంగిపోయే
సడిలేని తరంగపు స్నేహం
అడుగులు పడనీయక
తమతోనే ఉండమనే
తడి ఇసుక తపనకు
తరించి పోదా మానసం!
వెలుగులు విరజిమ్ము రవి
కిరణపు హస్తం చాచి చేసే
ఉదయపు పలకరింపునకు
హృదయం పులకించిపోదా!
నులివెచ్చగ తనువును తాకి
అరచేత మోమును నిలిపి
మురిపెమంతా కురిపించే
మామ్మ నవ్వంటి బింబము
కుశలమడిగి వరములిడి
ఆయుష్మంతుడివి కమ్మని
అడగకనే అన్నీ అమర్చే
అంశుమంతుడి అపేక్ష కు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి