సామెత -167-ఆకుకి అందకుండా -పోకకు పొందకుండా
***
"అవ్వా! గా మావ ముచ్చెటి ఏంది? ఏం జెప్పినా ఎడ్డెం తెడ్ఢెమేనా? ఏది సక్కగ జెప్పడా? ముక్కేదంటే ఎదురుగా సూపిచ్చొచ్చు గద. సుట్టు శెయ్యి దిప్పి సూపుతడు.బవ్ శిత్రమైన మడిశిలే.
శెల్లె! మావ మావ అంటున్నవు గని గింతకీ ఏ మావ? గాయన పేరేందో జెప్పవైతివి.
గాయనే అవ్వా! దుర్గయ్య మావఁ. ఏందో అంతా పెడసరం. ఒక్కటీ సక్కంగ జెప్పడు.నువ్వేమన్న అనుగని గాయనతో మాట్లాడితే తల్కాయ ఏడెక్కి పోద్ది. ఏలికేస్తే కాలికి -కాలికేత్తే ఏలికి అన్నట్టుంటది గాయన యవ్వారం.
అస్లేమైంది శెల్లే? ఏం జరిగింది? గా మావ బిడ్డకి గీ నడ్మల సంవందాలు సూత్తుండు గద. ఎవలో మంచి సంవందవేఁ వొచ్చిందట.గా పిల్లగాడు మాంచి ఆత్తి పాత్తులున్నోడు. గస్మంటోడు సూన్నీకి వత్తుండు.పిల్లను నచ్చుతడో లేదోనని బుగులు బెట్టుకుండ్రంట. మొత్తానికి పిల్లగాడు పిల్లను మెచ్చినంక ఏందేందో అంటుండటవ్వా !గిన్ని దినాలు మద్దెవర్తి ఎంట బడ్డడు పిల్ల నచ్చిందా? అడగమని.గాళ్ళు నచ్చిందని జెప్పినంక నిమ్మకు నీరెత్తినట్లు ఉండట.గదేందంటే ఆగమని గద్దిత్తడంట. మన్సుల ఉందేందో శెప్పమంటే నానుత్తా ఉండంట...దుర్గమ్మత్త గీ యిష్యాలు జెప్పుకొని కళ్ళనీళ్ళు బెట్టుకొంది.
శెల్లే! గిస్మంటోని బుద్ధినే "ఆకుకు అందకుండా -పోకకు పొందకుండా" అంటరు. గిస్మంటి బుద్ధి ఉన్నోడు ఏదీ సరింగ జెయ్యడు.ఏది ఇష్టం ఏది ఇష్టం లేదో తేల్చి శెప్పడు. ఇవతలోల్లని సుత జెయ్యనియ్యడు.
మన దుర్గయ్య మావఁ సుత గీ కోవకి చెందినోడే.పిల్లను నచ్చిండ్రు గని ఇంగ సంవందం కుదురక ముందే గిన్ని మల్లగుల్లాలు పడుతుండ్రు.తీరా లగ్గమప్పుడు ఇంగెట్ల జేత్తడో అవ్వా!
అవును శెల్లే! గిస్మంటోళ్ళు అన్ని అవకతవక పన్లే జేత్తరు. గందుకే గిస్మంటోళ్ళని జూసే గీ "ఆకుకు అందకుండా- పోకకు పొందకుండా" అన్న సామెత బుట్టింది.
అంటేందో మల్లొక్క త్యేప సమజయ్యేట్టు శెప్పవ్వా!"
ఆకుకు అందకుండా- అంటే మనోళ్లు ఒకప్పుడు పండుగలు పబ్బాలు పెండ్లిల్లప్పుడు ఆకులు వొక్కలు తెప్పించి తాంబూలమని ఇచ్చే టోళ్ళు.ఆకు ఎట్లుండాలె.గాదాన్ల సున్నం వొక్క లాంటివి పట్టాలె.ఎందుకంటే సక్కంగ దాన్ని మడుత్తరు. ఆకు శిన్నగుంటే మడ్వరాదు -పోక దాంట్లె పెట్టనీకి కుదర్దు. ఏదీ సరింగ కుదరక శికాగ్గ ఉంటుంది.గాదాన్నే మడిషితో పోల్శి గిట్ల జెప్పుడైతుంది.
గదండీ సంగతి! "ఆకుకు అందకుండా- పోకకు పొందకుండా" అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి