ఆమె లేనిదే మనుగడయే లేదుబాల్యంలో అమ్మకి అన్ని పనులలో సహాయం చేస్తుకన్నతండ్రికి కనుపాపవైఅల్లారుముద్దుగా పెరిగిన నీవు ఇంటి దీపానివేవివాహామై భర్తకు అన్నివేళలా తోడునీడగాఅతిథి అభ్యాగతుల సేవలోపిల్లలకు నైతికవిలువలు నేర్చిబరువు భాధ్యతలలో సగభాగమై'క్షమాయ ధరిత్రి' కి మారుపేరుగాఅత్తమామల నాదరించే ఇంటి మహాలక్ష్మివి.నేడు ఓ మగువా పురుషునితో బాటుశాస్త్ర సాంకేతిక రంగాలలోనే గాకదేశ రక్షణలోనుదేశ ప్రధాని, అధ్యక్ష పదవిలోనువిద్యా ,వైద్య రంగాలలోనుఎన్నని చెప్పను ఏమని చెప్పనుసవ్యసాచివై పురుషునిలో సగభాగమైఅర్ధనారీశ్వరతత్వానికి ప్రతీకవైనఓ మగువా సరి లేరు నీకెవ్వరు....!!..........................
ఓ మగువా సరిలేరు నీ కెవ్వరు: - కవిమిత్ర సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి) -హైదరాబాద్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి