సుప్రభాత కవిత : - బృంద
తొలివెలుగు చూపే దారిలో 
తొలి అడుగు వేసే చరణానికి 
తెలి మబ్బుల స్నేహం తోడు 

అల నీలి గగనం నుండి 
ఇల చేరిన వెలుగులోన 
కల తీరే దారులు మెండు

జగతిని కలిగే మార్పులు 
సుగతిని చూపే మార్గాలై 
మగతను పొద్రోలే చురుకులు 

కొత్త చివురుల ఎరుపులో 
మెత్తగా మెరిసే మెరుపులో 
గమ్మత్తుగా  తోచే అందాలు

వడిగా విరిసే పువ్వులు 
జడిగా కురిసే నవ్వులు 
సడి లేని సందడి చేసే తరువులు

సుడి చుట్టు కోరికలతో 
తడి ఆరని తపనలకు 
ముడి వీడిన భావనలు

తెలవారిన తూరుపులో 
మెలమెల్లగ పాకే ఎరుపులు 
వల వేసి తెచ్చిన వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు