*అమ్మ ప్రేమ*: - *మిట్టపల్లి పరశురాములు*
అమ్మంటేఆదిగురువుసోదరా
 అమ్మంటేఆదిదైవంచూడరా 
అమ్మంటేచల్లనిజాబిల్లిరా 
అమ్మంటెమమతలమరుమల్లిరా

అమ్మచూపుకాంతిరా
ఆమెయెమనకాపురా
అనురాగవల్లిరా
అమ్మప్రేమగొప్పదిరా అద్భుతవిశ్వమ్మురా 

అమ్మలేనిజీవిలేదుగాంచరా
ఆమెఒడియెకలలసౌధమ్మురా
అమ్మఉన్నఇల్లేస్వర్గమ్మురా
అమ్మమనసుబాధపెట్టబోకురా
అమ్మబాటలోనీవునడవరా
కమ్మగపాఠములనుచదవరా
అమ్మమదిలోననెమ్మదిగానిల్వరా



కామెంట్‌లు