సామెత -164: -ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం
: ***
అవ్వా! నిజ్జంగా గింత తెల్వికల్ల మడిషిని నా జల్మల సూల్లేదు పో. తెల్వంటే గా ఎంకటేశం మావదే.
ఏంది శెల్లె! ఎంకటేశం మావని తెగ పొగుడుతున్నవ్. ములగశెట్టు ఎక్కిత్తున్నవా ఏంది?
ఎహె లేదవ్వా!గంత పెద్ద మడిషి గురించి పరాష్కాలాడ్తనా ఏంది? గీ ముచ్చటి తెల్సిన కానుంచి మావ సామాన్నుడు కాడు, అఖండమైన తెల్వి తేటలున్నోడని ఎర్కయిందవ్వా.
అవునా శెల్లె! గివన్నీ నువ్వు శెబ్తుంటే నాకు సుత గదేదో ఇనాలని ఆత్రంగుంది.
గదే అవ్వా!గీ నడ్మల అత్తమ్మ పట్నంల ఉన్న బిడ్డ తానికి ఎల్లింది తెల్సు గద .మావ ఒక్కడే ఉండు.
ఓనాడు ఏమైందంటే మావ ఇంటి ముంగల అరుగుమీన కూసుండంట.ఇంగ శీకటైతాంది. ఇంట్లెకి పోదమని లేత్తున్న సయమంలో పెద్ద మడిషిలెక్కన ఉన్న ఒకాయన మావ తానికి వొచ్చి అయ్యా! గీ వూళ్లెకి ఓ పని మీద వొచ్చిన.పని గాలె.శీతాకాలం పొద్దు. ఊకెనే పొద్దుగుంకి సీకటయై పోయింది. గీ రాతిరి మీయింట్ల పడ్కొని పొద్దుగాల ఎల్త కూసింత అనుమతియ్యరా? అని ఒక్క తీర్గ అడగబట్టిండంట. 'ఏమోలే అర్గుల మీద సలివెడ్తదని ఇంట్లెకి రామన్నడంట.
తన సోదంత జెప్పుకుంట మావని అడుగుట్లనే అనుమానం వొచ్చి'అమ్మనీ! ఈడు సామాన్నుడు గాడని ీీఅర్తమైందట. గాన్ని ఎట్ల వొదిలిచ్చుకోవాలె? ఏమైన శేత్తడా ఏంది అన్న ఇషారం మొదలైందట.ఎట్లైన గీన్ని పోలీసోల్లకి పట్టియ్యాలే అన్కున్నడంట.
గట్ల ఓ అర్రల మంచమేసి పడ్కొమ్మని ,ఒంటేలొత్తే దొడ్లోకి పొయ్యి రామని శెప్పి గాయన అటు బోంగనే గాయన తెచ్చుకున్న సంచిల తెల్ల పొడి పొట్లం ,శిన్న కత్తిని సూశిండంట. గా పొట్లంల గింత పొడి తీస్కొని ఏమెర్గనట్టు అక్కడ పెట్టిండంట.గాయనొచ్చి పడ్కొంగనే దస్తిల పొడిని గాడి మూతి కాడ బెట్టిండంట.గాడు బాగ నిద్ర పోంగనే అర్రకి తాళం బెట్టి.గాడు గా మత్తు పవుడరికి తెల్లారిందాక లెవ్వలేదట.గప్పుడు సుట్టుపక్కలోల్లతో కలిసి పోలిసోల్లకి పట్టించిండంట అవ్వా!
నిజంగనే శెల్లె! మావ సామాన్నుడు కాడు. "ఆవులిత్తే పేగులు లెక్కబెడ్తడు" అని తెల్సింది.
"అంటేంది అవ్వా?
గదే శెల్లే! మన మాట తీరు యవ్వారం బట్టే మన్సులోని ఇష్యాలను అర్తం చేసుకోడమన్న మాట.
అక్కడే కూసోని రాసుకుంటున్న భూలచ్మి అవ్వా! మా బల్లె లొల్లి చేత్తున్నప్పుడు మా తాన కొచ్చి "ఒరేయ్! మీల ఎవలు లొల్లి చేత్తుండో నాకు తెల్సు ఆవులిచ్చకుండనే పేగులు లెక్క బెడత. లొల్లి సేయకుంట కూసోండ్రి అంటడవ్వా
అవునే భూలచ్మీ! గట్ల సుత తెల్విగలోల్లు ఉంటరు.
"గదండీ సంగతి ఆవులిస్తే పేగులు లెక్కబెడ్తడు అంటే...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి