దుర్గావతి దేవి: - - యామిజాల జగదీశ్
 
మన దేశ స్వాతంత్య్రం  కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన బెంగాలీ అమరవీరురాలు దుర్గావతి దేవి. ఈరోజు ఇమె 119వ జయంతి. 1928లో బ్రిటిష్ అధికారి జాన్ పి. సాండర్స్‌ను హతమార్చిన తర్వాత, భగత్ సింగ్, రాజ్‌గురు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఆమె సహాయం చేశారు.
బ్రిటిష్ సైనిక నిర్బంధ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన బాంబు దాడుల ప్రచారంలో పాల్గొన్న తర్వాత, 1929లో భగత్ సింగ్ లొంగిపోయారు. అనంతరం దుర్గాదేవి లార్డ్ హేలీని హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నం విఫలమైనప్పటికీ, దుర్గాదేవి పట్టుబడకుండా తప్పించుకున్నారు.
కానీ ఆమె సహచరులలో చాలామంది మరణించారు.
ఆ తర్వాత ఆమె  పోలీసులకు చిక్కారు. హత్యాయత్నం నేరానికిగాను ఆమెకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
దేశభక్తుడు భగత్ సింగ్, అతని సహచరుల విచారణ సమయంలో, వారిని రక్షించుకోవడానికి సహాయపడటానికి ఆమె తన 3,000 రూపాయల విలువైన ఆభరణాలను అమ్ముకున్నారు.

కామెంట్‌లు