****
"అవ్వా! ఇయ్యాల మాబల్లె సార్లు తొమ్మిదో తర్తి అక్కల్ని అన్నల్ని మస్తు తిట్టిండ్రు పో!"
"అవునానే భూలచ్మీ! గా సార్లు పోరగాండ్ల మీద ఎందుకంత గుస్సా అయిండ్రు. శితిని పన్లేమన్న సేశిండ్రా ఏంది?"
"గీ బడి పొల్లగాండ్లకి సుత ఏం జెప్పేటట్టు లేదు? సదువు లేదు సందె లేదు. పొద్దత్తమానం అమ్మా నాయిన మీద గుర్కాయించి సెల్లుల మూతి బెట్టి ఒక్క తీర్గ సూసుడు. ఏం పొల్లగాండ్లో ఏమో పో.అద్దు పద్దు లేకుండా పోయింది."
"అవునవ్వా! నువ్వన్న గీ మాటలన్ని మా సార్లు సుత అన్నరు.గీ నడ్మల పెద్ద తర్గతి అన్నలు మస్తు ఇస్టైల్లు శేత్తుండ్రు తెల్సా!"
ఏం టైల్లే తల్లీ!ఏం జేత్తుండ్రేటి?
"అవ్వా కొందరన్నలైతే తల్కాయ మీద తట్ట బెట్టినట్లు, ఇంకొందరు కత్తి గాట్లు పడ్డట్టు జుట్లు కత్తిరించుకుండ్రు. గదంత లేటెస్ట్ పేషనంట.
కొంత మంది అన్నల ప్యాంట్లు బిచ్చపోళ్ళ బట్టల్లెక్కనే శిరుగులు బట్టి ఉన్నయ్. గది సుత పేషనంట అవ్వా!"
ఇంకొందరైతే దొరబాబుల్లెక్క టిప్పుటాపుగ తయారై ఒత్తుండ్రు.బల్లె అందరికీ ఒక్క తీర్గ ఇచ్చే బట్టలేస్కోకుండ గిట్ల తీరు తీర్గ ఒత్తుంటే సార్లు పంతులమ్మలు ఎన్ని త్యేపల మంచి మాటల్తో బుదగరిచ్చి శెప్పినా ఇనకుంటే గియ్యాల అందర్ని ఒక్కదగ్గర కూడబెట్టిండ్రు. పెద్ద సారు లేశి గురువులు శెప్పిన మాటినకుండ గట్ల జెయ్యడం పద్ధతి గాదని గట్టిగనే కోపం జేసిండు. గీ సోకులు కాదురా కావల్సింది."ఆకార పుష్టి నైవేద్య నష్టి లెక్క ఉండటం గాదు సద్వుల ఉండాలె అన్నడవ్వా!" గా మాట నాకస్సలు అర్తం కాలే? గదేందో శెప్పు అవ్వా!"
"భూలచ్మి మాటల్కి" మీ పెద్ద సారు జెప్పినట్టు గీ నడ్మల పొల్లగాండ్లు ఆకార పుట్టి నైవేద్య నట్టి లెక్కనే తయారయ్యిండ్రు. అంటే సూపులకు సూటుబూటుతో సక్కంగా కన్పిత్తరు,వత్తరు గని పొట్ట గోత్తే అచ్చరం ముక్క రాదు.గందుకే వాళ్ళను గీ సామమెతతో పోల్శి తిడుతుంటరు.
"అంటే అవ్వా! ఆకారం సూత్తుంటే బలంగ మంచిగ కన్పిచ్చి,సద్వు సరింగ రానోళ్ళను గిట్ల తిడ్తరా అవ్వా!"
'అవును బుడ్డోడా! ఆకారం పుట్టి గాదు.సద్వు పుట్టి గుండడం కావాలె" అన్న అవ్వ మాటల్కి ఇద్దరూ రెండిట్ల పుష్టిగుంటం అన్నరు.
గదండీ సంగతి " ఆకార పుష్టి నైవేద్య నష్టి అంటే చూపులకు బాగుండటం గాదు లోపల సారం ఉండాలె గదేనండీ! సదువుల సారం ఉండాలె. సమజైంది గదా!"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి