సామెత -160: -ఆవు చేలో మేస్తే దూడె దుగాన/ గట్టున మేస్తుందా?
*****
"అవ్వా! అవ్వా! మా బల్లె నాల్గో తర్తి సద్వుతున్న అప్పిగాడు లేడు.గాడైతే సైకిల్ మీద వొచ్చుకుంట మీద మీదకి వొచ్చిండవ్వా! నాకు మస్తు బయ్యమైంది తెల్సా! పక్కపొంటి ఉన్న మోరీల పడ్తనని."
"అవున్రా బుడ్డోడా! ఎవ్వలికైనా బయమైద్ది.గట్ల జేసుడు తప్పు గద"
గా మాటే అన్నవ్వా! అన్నా! గంత పేద్ద రోడు వెట్కొని గక్కన్నించి బోకుండ గట్ల మీదికి తెత్తవేందన్నా! అన్న."
"శిన్నోడివైన మంచిగ జెప్పినవ్ రా బుడ్డోడా!"
అవ్వా! గా మాట అన్నననే నన్ను మస్తు తిట్టిండు. గీ రోడు మీ అమ్మేయించిందా? అయ్యేయిచ్చిండా.నకరాలు చేత్తున్నవ్ ఏంది ?నా ఇట్ట మొచ్చినట్టు నడుప్త. నీను వత్తుంటెనే తప్పుకోవాలె'.ఒరే బుడ్డోడా! బుద్ధి లేదా యాడ పారేసుకున్నవ్.'బుడ్డోడు బుద్ధి లేనోడు' గట్ల ఏవేవో అన్కుంట ఎక్కిరిచ్చుకుంట పాట సుత పాడిండవ్వా!"
"అయ్యో! బుడ్డోడా! గాడెవడ్రా! బల్లె సార్లకి జెప్పక పొయినవ్! పిచ్చి శెకలు చేత్తుండని గాని తోడ్కలు తీసేటోళ్ళు గద.
"వామ్మో అవ్వో! మన బుడ్డోడు గిన్క జెప్తే నిజ్జంగనే మోరీల తోశేటోడు.గాడు మస్తు కంత్రి గాడవ్వా! గాని జోలికి మేమెవ్వలం బోం అవ్వా!"
అంటున్న భూలచ్మి మాటల్కి అడ్డవడి " గింతకీ గాడేవడే భూలచ్మీ ?నాల్గో తర్తి సద్వుతున్న పోరడికే మీరు గింతగనం బయవడ్తుండ్రు.
"అవ్వా!అవ్వా! బోరింగ్ తాన నీళ్ళు బట్కుంట అందర్తో కయ్యం బెట్టుకుంటది సూడు.గా గంగమ్మత్తోళ్ళ పోరడే గీ అప్పిగాడు.గాడు బల్లె శిన్న పొల్లగాండ్లను ఏడిపిత్తడు.తోటోళ్ళతో దినాం పంచాతి బెట్కొని సొక్కలు, లాగులు శింప గొడ్తడవ్వా!
"గాని గురించి సార్లకి జెప్పినమా! ఇంకేంలే! గాళ్ళకెందుకు జెప్పిండ్రని శెప్పినోళ్ళని ఉరికిచ్చి ఉరికిచ్చి ఏడిపిత్తడవ్వా! బుడ్డోడు దయిర్నం జేసి గా మాట అన్నందుకే గాన్ని దినాం ఏడిపిత్తుండు."
"అయ్యో గట్లనానె భూలచ్మీ! గింత దనుక వొచ్చిందా? గాని దుంపతెగ. అయినగని గాని అమ్మని అనాలె."ఆవు చేలో మేస్తే దూడె దుగాన/ గట్టున మేత్తుందా"?
"అంటేందవ్వా? బుడ్డోడు భూలచ్మి ఇద్దరూ ఒక్కపాలె అడిగిండ్రు.
మనం అడివిలకి గొడ్ల మందని తోల్కపోయి కాపుకొని వొత్తంగద. గందులో ఆవునో బర్రెనో చేన్లబడి మేత్తే దాంతోపాటు వొచ్చిన దూడ సుత అమ్మ లెక్కనే పొలంలనే మేత్తది. గట్లనే ఇంట్లె అమ్మ నాయినలకి మంచి బుద్ధులుంటే గాళ్ళని జూసి పిల్లలు సుత నేర్సుకుంటరు. ఇంట్లెనించే మంచి శెడు, యినయం ఇదేయత నేర్సుకోవాలె.ఇంట్లె ఉన్నోళ్ళు నేర్పాలె.
" గట్ల శెప్పలేదు గన్కనే అమ్మ శకలు, లచ్చనాలు వొచ్ఛినయి గాడికి.పిల్లలు అమ్మేం జేసేది సూశి గట్లనే శెయ్యడానికి ముందు వడ్తరు.గస్మంటోళ్ళని గమనిచ్చే గిస్మంటి సామెత పుట్టింది రా "!
" రేపు గాని సంగతి ఇంటికెళ్ళి తెల్సుకుంటగని దయిర్నంగ ఉండుర్రి."
అవ్వ మాటల్కి బుద్ధిగ తల్కాయలు ఊపిండ్రు బుడ్డోడు భూలచ్మి.
గదండీ సంగతి."ఆవు శేలో మేత్తుంటే దూడ గట్టున/ దుగాన మేత్తుందా? "అంటే గిదే మరి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి