బహు పాత్రదారి: - - నామ వెంకటేశ్వర్లు,- తెలుగు ఉపాధ్యాయులు - నల్లగొండ, తెలంగాణ.
 అమ్మగా జన్మనిచ్చి, లాలించి, బుజ్జగించి, పాలించి . 
అక్క గా అనురాగాన్ని, ఆప్యాయత ను అందించి 
చెల్లిగా చెలిమి చేస్తూ  చేరదీస్తూ 
ఒదినగా ఓదారుస్తూ ఒద్దికగా ఉంటావు 
మరదలిగా మర్యాదనిస్తూ అందరి మెప్పుపొందుతావు 
అత్త గా ఆదరణనిస్తూ,ఆడుకుంటావు 
అమ్మమ్మ గా హక్కున చేర్చుకుని 
అందరిస్తావు 
నానమ్మ గా నజర్ పెంచుతూ 
నారజు కానివ్వవు 
కోడలిగా కలివిడిగా ఉంటూ 
కలుపుకుపోతావు 
పుట్టింటి బంధాలకు దూరమై
మెట్టింటి వారితో బంధాన్ని మెరుగు చేసుకుంటూ 
అత్తా మామలతో అణకువగా 
మసలుతూ
మెట్టింట వారిని ఆదరిoచి తాను ఆదరించబడుతూ
 
మేనత్త గా మేర్మానం చూపిస్తూ 
మా మేలుకోరుతుంటావు 
 
 చిన్నమ్మ వై చింతలు తీరుస్తావు 
చీదరించుకోకుండా 
కూతురై కుదురుగా ఉంటావు 
కుటుంబాన్ని కి పేరు తెస్తావు 


స్నేహితురాలిగి క్షేమం కోరుతూ 
చక్కని దిక్కసూచి వవుతావు 
    కవయిత్రి,.... రచయిత్రి,... రాజకీయ నాయకురాలిగా...వీరానారిమణిగా.... ఇంకా అన్ని ఉద్యో గాలలో నేను సైతం అంటూ.. పురుషుని తో సమ ఉజ్జీగ నీ విద్యుక్త ధర్మాన్ని విస్తరింప చేస్తావు ........           అర్ధాంగిగా....ఉంటూనే... తుదకు అన్ని తానై ,    బహు పాత్రలు  పోషిస్తావు .
 నీకు, నీకు నీవే సాటి...పోటీ...   
         ( మహిళా మూర్తులందరికి.......... అనుబంధం గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹🌹🙏)

కామెంట్‌లు