ప్రకృతిలోని ప్రతి వస్తువు కవిత రచనకు శ్రీకారవుతుందని కవి ఉండ్రాళ్ళ రాజేశం ఉన్నారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తన నివాసంలో సిద్దిపేట కవులకు సత్కారం చేశారు. ఈ సందర్భంగా రాజేశం మాట్లాడుతూ స్వేచ్ఛగా తన మనసులోని భావాలను అక్షర రూపంగా ప్రపంచానికి చాటేది కవులు మాత్రమేనని, సమాజ శ్రేయస్సుకు పాటుపడే కవుల రచనలు చిరకాలం నిలుస్తాయన్నారు. వర్కోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, కోణం పర్శరాములు, కాల్వ రాజయ్య, చీకోటి రాములు, మిట్టపల్లి పర్శరాములు , గంగాపురం శ్రీనివాస్, అనిశెట్టి సతీష్ కుమార్, నల్ల అశోక్, ఉప్పరి బాలచంద్రం తదితర కవులకు సత్కారం చేశారు.
ప్రకృతిలోని ప్రతి వస్తువు కవితకు శ్రీకారం :ఉండ్రాళ్ళ
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి