కొండపైన జాలువారే
కాంచన ధారలో
కోనలన్ని తడిసి మురిసే
కమ్మని సమయాన
తెల్లగా మెరిసే
తుహిన శిలలు
తపోదీక్షలో ఉన్న
తాపసులై తోచగా...
గగనవీధిలో నడయాడు
మబ్బుల కదలికలు
దివికి కాపలాగా తిరిగే
గస్తీ సైనికుల పోలగా...
చేరవలసిన తీరము
దూరముగా తోచినా...
చూపులకు స్వర్గము
చేతికందిన తీరుగా.....
సుందర ప్రకృతి చేయు
ఇంద్రజాలమున చిక్కి
మాట రాక అచ్చెరువొంది
మైమరచి నిలిచిపోయి
దివిలో ఉహించు
దివ్య సౌందర్యము
భువికి కానుకగా ఇచ్చిన
భగవానుడికి మొక్కుతూ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి