మా అమెరికా అనుభవాలు...: - పోణంగి బాల భాస్కర్
 ఆకాశవాణి హైదరబాద్ కేంద్రంలో డ్యూటీ ఆఫీసర్ గా రిటైర్ అయిన శ్రీమతి నీలా విజయలక్ష్మి గారిని సౌత్ కెరొలినా - ఫోర్ట్ మిల్ లోని వాళ్ళ అమ్మాయి బిందు ఇంట్లో 2 మార్చి, 2018 శుక్రవారం కలిశాను. నాకు ఒక్కసారిగా ఆకాశవాణి కేంద్రానికి వెళ్లినంత సంతోషం కలిగింది. నేను రేడియోలో వార్తలు చదివిన తరవాత డ్యూటీ రూంలో సంతకం పెట్టడానికి వెళ్ళినప్పుడు విజయలక్ష్మి గారు డ్యూటీ లో ఉన్నట్లైతే తమ హ్యాండ్ బ్యాగు లోనుంచి చాకోలెట్ గానీ, బిస్కెట్ గానీ లేదా ఆ సమయంలో అందుబాటులో ఉంటే ఒక కప్పు టీ  గానీ ఇచ్చేవారు. చిరునవ్వులు చిందిస్తూ కుటుంబ యోగక్షేమాలు  కనుక్కొని ఎంతో ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేసేవారు. ఇప్పుడు ఇక్కడ ఆమెను చూడగానే ఆ రోజులన్నీ ఒక్కసారి కళ్ళముందు గిర్రున తిరిగాయి. పరస్పరం ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము.
నేను, నా శ్రీమతి, మా అమ్మాయి, అల్లుడుగారు నలుగురం వెళ్లాము.  మా కోసం విజయలక్ష్మి గారే స్వయంగా కమ్మని ఆహార పదార్ధాలు చేసి వడ్డించారు.
విజయలక్ష్మి గారి అమ్మాయి, అల్లుడు, మనవరాళ్లతో సమయం తెలియకుండా చాలా సేపు కాలక్షేపం చేసాము.
 మరోసారి రావలసిందిగా  పదే పదే కోరారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకున్నాము 
ఆ విధంగా అమెరికాలో ఆకాశవాణి కబుర్లు చెప్పుకున్నాము.
🌸🌷🌸


కామెంట్‌లు