ఆసరా లేని వృ ద్దా ప్యం
అమ్మా ఎందుకా యాతన !?
బరువులు, బంధాలు వదిలేసే వేదాంతము వంట బట్టాల్సిన చరమా0కము మీది...!
మోయలేనన్ని బాధ్యతల భారముతో వంగిన మీ నడుమే చెబుతోంది...
మీ కర్తవ్య నిష్ట...!!
యింకా మీ కెందుకీ బరువులు, బాధ్యతలు ?!
నిష్కామ కర్మిష్టివా తల్లీ!!
ఇవేవైనా... మీకు బంధములై ప్రతి బంధకము కారాదు...!
నీవు ముక్తు రాలివి కానిదే, మోక్షమును పొంద లేవు...!!
జన్మ జన్మ లకు ఈ కర్మ జన్మ ల వలయములో గోరంత సుఖాలకు కొండంత కష్టాలు.... బాదలు, దుఃఖాలు...
తప్పవు తల్లీ...!!
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి