ఔను, మా ఇద్దరికీ మాటలొచ్చు. కానీ మూగవాళ్ళం. ఇందువల్ల ఎప్పుడు కలిసినా బాధే కలుగుతుంది. అతనెలా ఫీలవుతారో తెలీదు కానీ నేనైతే బాధపడటమే కాదు, నిర్లక్ష్యం చేస్తున్నారేమోనని కూడా అనుకుంటాను. ఇంతకూ ఏమిటీ విషయం అనేగా మీ ప్రశ్న.
మేము ఉంటున్నది మౌలాలీలో ఓ అపార్ట్మెంట్. పేరు ఐశ్వర్య ఎంక్లేవ్. ఫ్లోరుకి రెండు చొప్పున మొత్తం ఎనిమిది వాటాలున్నాయి. అందరం తెలుగు తెలిసిన వాళ్ళమే. ఒక్క మా పక్క వాటాలోని వ్యక్తి తప్పించి. ఆయన ఒరిస్సా అతను. అతనికి ఒరియా, హిందీ, ఇంగ్లీషు వచ్చు. నాకు హిందీ రాదని తెలిసినా ఆయన నాతో ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటే హిందీలోనే చెప్తాడు. ఆయనేం చెప్తున్నాడు ఓ ససేమిరా అర్థం కాదు. అయినా నేను నవ్వి ఊరుకుంటాను. మా ఇద్దరి మధ్య అదేమీ పెద్ద సమస్యే కాదుగానీ ఆయన ఏడాదికి ఒకసారో రెండుసార్లో వాళ్ళ నాన్నను ఒరిస్సా నుంచి తీసుకొస్తాడు. ఆయనకు వయస్సు డెబ్బై పైనే ఉంటాయి. నాకు డెబ్బయి రెండు వచ్చి ఇది నాలుగో నెల. ఆయనతోనే నాకొచ్చిన చిక్కల్లా. ఎందుకంటే, ఆయనకు ఒరియా ఒక్కటే వచ్చు. హిందీ వచ్చు కానీ హిందీ మాట్లాడినా ఒరియా స్లాంగ్ లో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. కనుక ఆయన ఏం మాట్లాడుతున్నాడో అక్షరం ముక్క అర్థమైతే ఒట్టు. పక్క పక్క వాటా వాళ్ళం. కనుక రోజులో కనీసం ఆరేడు సార్లయినా ఆయన ఎదురుపడతాడు. అలా కనిపించినప్పుడల్లా వీలైతే నవ్వడం లేకుంటే అదీ ఉండదు. ఆయన ఒరియాలో ఏమేమో అంటాడు. ఏమీ అర్థం కాదు. ఆయన నోటంట ఆ భాష మరీ మోటుగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే. నేను వింటాను తప్ప మౌనంగా ఉండిపోతాను. పైగా బాల్కనీలో మా గడప ముందున్న ఆసనంలో కూర్చుంటాడు గంటలకొద్దీ. ఇద్దరం మూగోళ్ళంలాగా ఉంటాం. నేనేమో గడప లోపల గదిలో ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. ఇద్దరం ఒక్కసారి చూసుకుంటాం. కానీ మాటలు ఉండవు. ఇద్దరికీ ఎవరి మాతృభాష వారికొచ్చు తప్ప నాకు తెలిసింది ఆయనకు తెలీదు. ఆయన కొచ్చిన భాష నాకు తెలీదు. ఇద్దరికీ మాటలొచ్చు కానీ మూగవాళ్ళలాగా కూర్చుంటాం. ఇది ఒకింత ఇబ్బందికర పరిస్థితే. ఏం చేయగలం. ఆయనేం అనుకుంటాడో కానీ నాకైతే తలనొప్పే. పైగా వయస్సులో దాదాపుగా సమానుడే. కనుక ఏదో ఒకటి చెప్పాలని ఉంటుంది కానీ ఏమీ లాభం లేదు. ఆయన బాల్కనీలో కూర్చున్నంతసేపూ నాకు ఇబ్బందికర మే. పైగా ఆయనకు మీరే వ్యాపకమూ లేదు. పత్రిక చదవటమో పుస్తకం చదవటమో తన మనవళ్ళతో గడపటమో లేక ఏదో ఒక పనితో తనను తాను బిజీ చేసుకోవడమో ఏదీ చేయడు.
భాష రాని ప్రదేశానికి వెళ్ళి మరే పనీ చేయకుంటే రోజులు గడవటం కష్టతరమే అన్పిస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి