విద్యతో వికసించి నిరూపించారు
వినయంతో విశాల ప్రపంచాన్ని అబ్బురపరచారు
ఉద్యోగాలలో సమర్థత చాటినారు
ఇంటినిర్వహణలో సాటిలేరు మీకు
పెంపకంలో మీ ముద్ర తప్పనిసరి కనబడుతుంది
ఆప్యాయతలో అంబరమే మీ హద్దు
సహనమే సహజ కవచంగా
సౌశీల్యమే తరగని సంపదగా
అన్నింటా మీరున్నారు.
ఆర్థికబలం,సుగుణాల చలనం
ఆత్మాభిమానం,రోషం,
అవసరమైతే అపరకాళికా రూపం
నారీశక్తి అనంతం,అద్భుతం
కాదేదీ మీకనర్హం
ఆకాశమే హద్దుగా మీ గమనం
నిరంతరం సాగుతున్న సమయం
పాలకులై,అధికారులై,కర్తవ్య
పరాయణులై కాంతులీనుతున్నారు.
స్వయం ప్రభలతో జగతి నిండుతున్నారు.
సాధికారత సాహసంతో సాధించిన వనితలు
పూజ్యనీయ,గౌరవనీయ వ్యక్తిత్వాలు
చరిత మిము లిఖించింది
కాలము సాక్ష్యమై నిలిచింది
మహిళాశక్తి అమేయమై,అనంతమై విశ్వరూపం దాల్చింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి