ఆత్మ దర్పణం: - కవిమిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి) -విశాఖపట్నం
గొప్పవాడినని అన్నీ నాకే తెలుసునని
నలుగురికి సమాజాన చెప్పేముందు
భగవాన్ రమణులు చెప్పినట్లు
నీవెవరో ముందు నిన్ను ప్రశ్నించుకో
యుక్తాయుక్త విచక్షణ కలిగిన మనిషివి
మంచి చెడులను తెలిసి ఆచరించక
ఎదుటివారికి చెప్పేటప్పుడు
ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా అని
వేమన చెప్పినట్లు
అంతరాత్మకి తెలుసునన్నది గుర్తుంచుకో.

దేముడు ఎక్కడో లేడు అత్యతిష్ఠ దశాంగులం అన్నది సనాతనం
ఆత్మదర్పణమే
నీవు చేసే ఏ పనికైన ఆత్మ సాక్షియే.

పరిశుద్ధ ఆత్మ కలిగినవాడు 
పరమేశ్వర ప్రతిరూపమే
జీవుడు, దేవుడు ఒకటే అన్నది తెలిసినప్పుడే
స్థితప్రజ్ఞత చేకూరును!!
..............................


కామెంట్‌లు