సామెత -173: ఆర్నెల్ల దుమ్ము గూట్లె ఉన్నదేందిరా అంటే నేను పనిల జేరి నెలే అయిందన్నడట
*****
"అవ్వా!అవ్వా! తమ్ముడేం జేసీండో తెల్సునా?లడ్డూల డబ్బాల్లో లడ్డూలన్ని ఎవలు సూడ కుండ మాయం జేసిండు."
వొరే బుడ్డోడా! అక్క జెప్పింది నిజవేనా? గది నీ పనేనని అక్క అంటున్నది"
"అవ్వా! నేను గన్నేం తిన్లే డబ్బ అడుగుల ఇంక మూడున్నయి తెల్సా"
"దొరికినవ్ రా మన్వడా! ఎన్కటి కెవడో ఒకాయన్ని నీ లెక్కనే "అన్నం కుండంత కాళీ జేసినవేరా? అంటే అడుగునింక అట్లనే ఉందిగ అన్నడంట.
అవ్వా అవ్వా! శాన్నాళ్ళయింది గీ దీనిమీద ఓ కత శెప్పరాదె"
గట్లనే శెప్త గని! జర మంచిగ సకిలం ముకిలం బెట్టుకొని కూసోండ్రి.
ఎన్కట ఓ సేఠు గారు ఇంట్లె,కొట్లె పని చేయడానికి వో మనిషిని పెట్టుకోవాలని గాళ్ళని గీళ్ళని అడగంగ అడగంగ ఒగాయన దొరికిండు.
'గాయన్ని ఇల్లునీ దుకాణాన్ని శుబ్బరం జేయమని జెప్పిండు సేఠు.
గీ దొరికిన పనోడేమో పని దొంగ.నెల తర్వాత సేఠు గారు ఇంట్లె, కొట్లె గా పనివాడు శుబ్బరంగ ఉంచిండా లేదాని సూత్తే మూల మూలల ఎక్కడి శెత్త ,శెదారం దుమ్ము ధూళి అట్లనే ఉంది.మట్టిగొట్టుకుపోయినట్టు కనిపించింది ఎక్కడా శుబ్బరంగా అనిపించలే.
కోపంతో గా మాటే అడుగుదామని ఆ పనోన్ని పిలిపిచ్చి ఆ పనివాన్ని అడిగాడు. గాడు ఎంతో వినయంగా అయ్యా .."అయ్యా నేను పనిలో కొచ్చి నెలేగా అయ్యింది.గవ్వన్ని నాకెట్ల తెలుత్తయి అన్నడంట.
అంటే అతడు ఏ పనిమీద సరిగ దృష్టి పెట్టడని, తప్పులను ఎత్తి చూపకుండా ఏదో మాటల్తో బోల్తా కొట్టి పబ్బం గడుపుకునే వ్యక్తి అని అర్థము.
ఒరేయ్ బుడ్డోడా! గట్లనే ఉంది నీ యవ్వారం.పనికొచ్చిందే శుబ్బరం చెయ్యడానికి. ఆర్నెల్ల దుమ్ము ధూళి అట్లనే ఎక్కడికక్కడ ఉంచి గాడు ఏం జేసినట్టు? "
అందుకే "ఆర్నెల్ల దుమ్ము ధూళి గూట్లె ఉన్నదేందిరా అంటే నేను పనిల జేరి నెలే అయ్యిందన్నడట"
"గిట్లాంతి అతితెలివి , సోమరి గాళ్ళు తప్పును ఒప్పుకోకుండా మతపరిచ్చడం అనగా మాట మళ్ళచ్చిటం అంటే గిదే."
అదండీ సంగతి."ఆర్నెల్ల దుమ్ము ధూళి అట్లనే ఉందేమంటే పనికొచ్చి నెలే అయిందని "ఎదుటి వ్యక్తి మాట మల్లించడం అని అర్థము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి