అక్షరాభ్యాసం: - డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 అజ్ఞానాన్ని వెంటపడి తరిమికొట్టి,
జ్ఞానాన్ని అనంతంగా‌ పంచిపెట్టాలి.
విజ్ఞానంతో సుసంపన్నులను చేసి,
విచక్షణను సంపూర్ణం కావించాలి.
వెనకబాటుతనాన్ని వేలెత్తి ప్రశ్నించి,
వ్యక్తిత్వాన్ని అక్షయంగా తీర్చిదిద్దాలి.
వెలుగులు అనుస్యూతంగా విరజిమ్ముతూ,
మార్గదర్శనం నిరంతరం జరపాలి.
శక్తిని ప్రోది చేసి,చైతన్యాన్ని రగిలించాలి.
బ్రతికే శక్తిని‌ ప్రసాదిస్తూ,
బ్రతికించే నేర్పును అందివ్వాలి.
అక్షరాలతో దోస్తీ చేస్తే,
కామధేనువై కలిసివస్తుంది.
నిన్ను నీకు పరిచయం చేసి,
నీ కాళ్ళపై నిలబడేట్లు తోడుంటుంది.
జీవితమంతా వెంటనడిచి,
శాశ్వత సంపదై కనబడుతుంది.
కామెంట్‌లు