తారుపల్లి హైస్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

 -- సర్పంచితో సహా 13 మంది మహిళలల్ని సత్కరించిన ఉపాధ్యాయుడు సత్య ప్రకాష్ రావు
 
 పెద్దపెల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాజనవేన స్వరూప, పాఠశాల మహిళా ఉపాధ్యాయినులు నన్నెబోయిన రమాదేవి, జంగపల్లి స్వరూప, అంగన్వాడీ టీచర్లు సుద్దాల శ్రావణి, ఒడ్నాల రాజమణి, ఎఎన్ఎం ఈర్ల (జూపాక) సునీత, ఆశ వర్కర్ మేకల రాధ, అంగన్వాడీ ఆయా బొడ్డుపల్లి వాణి, గ్రామ పంచాయతీ పారిశుద్ద కార్మికురాలు ఆముదాల సారమ్మ, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎర్రోజుల సరస్వతి, జక్కుల రమాదేవి, నాంపల్లి వనిత, వివో లశెట్టి రవళి, పాఠశాల పారుశుద్ధ కార్మికురాలు జక్కుల రాజేశ్వరిలతో కలిపి 14 మందిని ఘనంగా సన్మాణించినట్లు పాఠశాల ఆంగ్ల భాషోపాధ్యాయుడు కూరపాటి సత్య ప్రకాశ్ రావు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడిన వక్తలు సత్య ప్రకాష్ రావు చేస్తున్న ఇలాంటి అద్భుత కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సత్య ప్రకాష్ రావు మాట్లాడుతూ విద్యారంగంలో విశేష సేవలు అందించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల వల్ల అంతులేని ఆత్మ సంతృప్తి మిగులుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఆగయ్య, ఎల్లయ్య, రాజమౌళి, రమేష్, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు