నాగలి వదిలి కుంచెను పట్టాను :- దుబ్బాకుల కృష్ణస్వామి: -సేకరణ......అచ్యుతుని రాజ్యశ్రీ
 1
కవిత్వం నాకు రావడానికి కారణం వాజిపేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో 13 రోజుల్లో పడిపోవడం ఒక కారణం . 
2
యన్ టి రామారావుపై వైస్రాయి హోటల్ ఆవరణలో చెప్పులు విసరడం ఆయనను పదవీచ్యుతుని చేయడం బాధ కలిగించింది .
3 నేను మాకు తెలిసిన వారికి బ్యానర్లు వ్రాసిఇచ్చి డబ్బులడిగితే తిట్టడం మూడవ కారణం అప్పుడు నాలో బాధ ఏక్కవై వారిపై ఆశువుగా ఆటవెలదులలో పద్యాలలో నాభావాన్ని వ్యక్తపరుచు కున్నాను.కాని అనుకోకుండా ఎనభై శాతం ఛందస్సు కలిసిందని నాకు తెలిసిన టీచర్ కు చూపిస్తే చెప్పాడు.అప్పటికి నాకు ఛందస్సు రాదు.ఆయన ఛందస్సు పుస్తకం తెచ్చుకోమని సూచించారు.అది తీసుకొని ఒక్కొక్క ఛందస్సు నేర్చుకొని వ్రాయడం ప్రారంబించాను.అది 2001 వె సంవ్తసరం.అప్పుడు నేను శాకాహారం పై పద్యాలు వ్రాయడం ప్రారంబించి తొలిపుస్తకం విడుదల చేశాను. దానికి మంచి స్పందన రావడంలో ఇక వరుసగా వ్రాయడం మానలేదు.నాకు 1972 లో ఇంటరు రెండవ సంవత్సరం చదువుతుండగా వివాహం జరిగింది. 1973 లో ఇంటరు రెంవసంవత్సరం చదువుతుండగా తీవ్రమైన కరువు వచ్చింది.పశువులకు మేత కరువయింది.మనుషులకుధాన్యం కారు వొచ్చింది.మానసికంగా ఆందోళన ఎక్కవైంది.చదువు మానుకున్నాను.అప్పుడు నాకు చిత్రకళ పై ఆసక్తి పెరిగింది. వ్యవసాయం చేస్తు చిత్రకళ సాధన చేశాను.నాగలి దున్నుతున్నప్పుడు ఎడ్లకు కొందసేపు విశ్రాంతినిచ్చేవాము ( దానని దమ్మకు నిలబెట్టుట ) అంటారు అప్పుడు నానాగలికి కట్టిన ఎడ్లను చిత్రిస్తుండే వాడిని.ఆబొమ్మను చూడగానే అది ఏ ఎద్దు అనేది అందరు వెంటనే గుర్తుపట్టేవారు.అప్పుడు మాతమ్ముడు ఆలూరు హైస్కూలలులో చదువుకునేవాడు.తెలుగుపండిత్ కృష్ణయ్యగౌడు సారు బాగా డ్రాయింగ్ ఏస్తాడని నాకు పరిచయం చేశాడు .ఆయన నాకు వాటర్ కలర్స్ ట్యఃబులు,బ్రష్ ఇచ్చాడు.నాకు అంతవరకు వాటర్ కలర్స్ బ్రష్ లు చూడలేదు వాటితో నేను వ్యవసాయం చేస్తు సమయం దొరికినప్పుడు సాధన చేస్తుండేవాడిని.కొన్నిరోజులు ఉద్యోగానికని హైదరాబాద్ లో మా బంధువుల ఇంట్లో ఉండగా ఫైన్ ఆర్ట్స్ కాలేజ లో ఇంటర్వూ ఇచ్చాను సెలెక్ట్ అయినాను.కాని ఖర్చులకు భయపడి మానుకున్నాను.అప్పుడే ఉద్యోగవేటలో నాకు హైదరాబాద్ లో అఫ్జల్ గంజ్ లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లో పుస్తకాలు చదివే అలవాటు అయినది. అదికూడ నాజీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుపు తిప్పింది.మళ్ళీ ఊరికి పోయి వ్యవసాయం చిత్రకళ సాధన మొదలు పెట్టాను. 1976 మార్చిలో షాద్ నగర్లో నారాయణ శంభు డ్రాయింగ్ టీచర్ వద్ద డ్రాయింగు పరిక్ష నిమిత్తం పదిలహరోజులు ట్యూషన్ వెళ్ళాను. అదే సంవత్సరం లో ఆగస్టులో మా ప్రక్క ఊరి ఒక పెద్దభనిషి తన మిత్రునికి ఉత్తరం వ్రాసి నన్ను IZRA లో పెయింటర్ గా చేర్పించాడు.ఇక అప్పటి నుండి 2006వ సంవత్సరం వరకు పెయింటర్ గా పనిచేశాను.డిజిటల్ ప్రింటింగ్ వచ్చిన కారణంగా మా పెయింటర్ల ఉపాది ఊడిపోయి రోడ్లపాలైనాము .అప్పుడు మళ్ళీ వ్యవసాయంలో కే వెళ్ళిపోయాను.2024 మే 8 వె తేదిన నాభార్య మరణంతో ఊరునుండి హైదరాబాదు మాకొడుకులవద్దకు వచ్చాను..ఆయన నిజంగా కలం కుంచెతో సాధన చేయటం అపూర్వం.తనని గూర్చి ఇలా పరిచయం చేసుకున్నారు
1984 లో మాఊరి శివాలయంలో ప్లైవుడ్ పై వేసి కార్పెంటర్ పనికూడా నేనేచేసి చిత్రాన్ని కట్ చేసి పెయింటింగ్ చేశాను.


కామెంట్‌లు