అది ఒక ప్రశాంతమైన సాయంత్రం. ఒక బాలుడు తన తోటలో ఆడుకుంటున్నాడు. అతను ఒక మొక్క కొమ్మ మీద సీతాకోకచిలుక గూడును చూశాడు. ఆ గూడులోని ఒక చిన్న రంధ్రంలోంచి, ఒక సీతాకోకచిలుక బయటకు రావడానికి నానా తంటాలు పడుతోంది.
సమయం గడిచేకొద్దీ, ఆ సన్నని రంధ్రంలోంచి బయటకు రావడానికి కష్టపడుతున్న సీతాకోకచిలుకను చూసి ఆ బాలుడికి జాలి వేసింది. "అయ్యో పాపం, మనం దానికి సహాయం చేయాలి," అని అనుకుని, అతను ఒక కత్తెర తీసుకుని, గూడుకున్న రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు.
ఆ సీతాకోకచిలుక ఏ మాత్రం కష్టపడకుండా చాలా సులభంగా బయటకు వచ్చింది. కానీ అది ఖంగుతింది.
బయటకు వచ్చిన ఆ సీతాకోకచిలుక శరీరం ఉబ్బిపోయి, దాని రెక్కలు ముడుచుకుపోయి బలహీనంగా ఉన్నాయి. అది ఎగరడం చూడాలని ఆ బాలుడు ఆత్రుతగా దాని వంకే చూస్తున్నాడు. కానీ ఆ సీతాకోకచిలుక ఒక్క అంగుళం కూడా ఎగరలేకపోయింది. అది నేల మీద పాకుతూ ఉంది.
అప్పుడు అక్కడికి వచ్చిన ఒక వృద్ధురాలు, ఆ బాలుడి దుఃఖాన్ని అర్థం చేసుకుని, శాంతంగా ఇలా చెప్పింది :
"బాబూ, నువ్వు చేసింది సహాయం కాదు. నువ్వు దాని పెరుగుదలను ఆపేశావు. ఆ సీతాకోకచిలుక పోరాడి ఆ చిన్న రంధ్రంలోంచి బయటకు వచ్చినప్పుడే, దాని శరీరంలోని ద్రవం రెక్కలకు చేరుతుంది. ఆ పోరాటమే దాని రెక్కలకు ఎగరడానికి బలాన్ని ఇస్తుంది. నువ్వు ఆ పోరాటాన్ని ఆపడం వల్ల, అది తన జీవితాంతం ఎగరగల సామర్థ్యాన్ని కోల్పోయింది."
దీనివల్ల తెలుసుకోవలసిన విషయం...
జీవితంలో మనం ఎదుర్కొనే పరీక్షలు, పోరాటాలు మనల్ని కుంగదీయడానికి కావు. అవి మన రెక్కలను బలపరచడానికే వస్తాయనే వాస్తవాన్ని గ్రహించాలి.
ఒకరికి అవసరం లేకపోయినా ఏదో మంచి చేస్తున్నాను కుంటి తొందరపడి సహాయం చేయడం వారి ఆత్మవికాసాన్నీ, నేర్చుకునే సామర్థ్యాన్నీ అడ్డుకోవడమే అవుతుంది.
పోరాటం లేకుండా జీవితంలో నిజమైన ఎదుగుదల ఉండదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి