సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -182: - ఆవు మేత లేక చెడింది - చేను చూడకుంటే చెడింది
*****
"ఎగసాయం శెయ్యాలంటే గా బూదేవంత ఓపికుండాలె.గొడ్డు గోదా పెంచాలంటే బాంచె శాకిరి శెయ్యాలె.గియ్యన్ని తెల్సుకున్నంకనే గాటి మీద దృట్టి పెట్టాలె"  శెవినిల్లు గట్టుకొని శెప్పిన.ఇంటెనా! మా ముస్లోల్ల మీద పడేశి ఏం బట్టనట్టు తిర్గుతుండవ్వా!"
 అయ్యో! అత్తా!గట్ల రంది జెయ్యవడ్తివి?  ఊకో!జెర్ర తమాయించుకో. గవన్ని ఆటంతలయ్యే సద్దుకుంటయి తీ! అస్లే ఒంట్లె సుత బాగలేకనే పాయె!"
 గియ్యన్ని ఎవ్వలు పట్టిచ్చుకుంటరే అవ్వా! ఇంట్లున్న గొడ్లనే సూస్కునే దిక్కు లేదాయె.సేశీ సేశీ రెక్కలు బోతున్నయని మొత్తుకున్నా దిక్కేది.మొన్న ఆరం దినాల కింద సంతకి బొయ్యి ఆవును గొనుక్కొచ్చిండు.గియ్యుండంగ గదెందుకురా అయ్యా! అంటే 'గోవుమాలచ్మి వుంటే ఇల్లు కళకల్లాడ్తదని' అంటడు.
 "అవునా అత్తా!ఆవుంటే మంచిదే తీ!"
 "ఏం మంచే అవ్వా!తెచ్చినోడు దాని ఆలన పాలన సూస్కోవాల్నా.దానికి కొత్త పలుపు తాడు ఇడిత్తె సాలు దారివట్టుకొని పోతుండె.మీ మావఁ కేం శాతయిద్ది. నాకేం శాతయిద్ది. దాన్ని తోల్కొచ్చి కొట్టంల దోలేతల్కి తల పానం తోకకొచ్చినట్టయితంది.
 "ఇగ్గో గీ నాల్గు దినాల్నుంచి జొరమొచ్చి మీ మావఁ నేను మంచం నేత్తున్నం. నోట్లె గిన్ని మంచినీళ్ళు బోసే దిక్కే లేదు.గా గొడ్ల సంగతి ఆడు,మేవుఁ  పట్టిచ్క పోయేతల్కి గవి జూడు ఎట్లయినయో! ఇంగ శేనెట్లుందో గా దేవున్కే తెల్వాలె."
అవునత్తా"  ఆవు మేత లేక శెడింది -శేను సూడకుంటె శెడింది అంటే గిదేనేమో!"
 అవునే అవ్వా! గొడ్డుకి తిన్నది బలం. మనిషికి ఉన్నది బలం. శేనికి కాపలా బలం అన్నట్టు ఆటిని పసిపొల్లగాండ్ల లెక్క సూసుకోవాల్నే!"
 "నేనిప్పుడే మా ఆయనకి శెప్తా నత్తా!మా గొడ్లతో కలిపి తోల్కపొమ్మని జెప్పి, గా శేనికి నీళ్ళు సుత పెట్టిత్త.నువ్వసలు రంది జేయకు."
 "గట్లనే అవ్వా నీ కడ్పు సల్లగుండ. గట్ల శెయ్యి బిడ్డా! నీకు పున్నెముంటది."అంటున్న అత్త మాటల్కి " పోయొత్త అన్కుంట బోయింది అవ్వ.
 గదండీ సంగతి ఆవునైనా మనిషైనైనా ఆధార పడే వాళ్ళకి తిండీ తిప్పలు సరింగ సూస్కోకబోతే ఆరోగ్గెం శెడిపోతది. గట్లనే శేను శెలక ఏదైనా బాద్దెత తీసుకోవాలి. గట్ల తీస్కోకబోతే సరింగ పండదు.గందుకే గీ "ఆవు మేత లేక శెడింది -శేను సూడకుంటె శెడింది" అనే సామెతను వాడుతరు.

కామెంట్‌లు