శారీరక మానసిక రోగాల కి సంబంధించిన మంత్రాలున్నాయి.కుష్టు కామెర్లు నేత్ర రోగాలకు,బట్టతల నరాల బలహీనత,విషకీటకాలవిరుగుడుకి నేటికీ మంత్రాలతో నయం చేసేవారున్నారు.బ్యాక్టీరియా సూక్ష్మ జీవులు,భూతాలు ప్రేతాలు అన్నీ భయంకర ఆకారాలు కాదని రాక్షసులు మనం సినిమాలో చేసేలా భయంకర ఆకారాల్లో ఉండేవారు కాదని తేల్చి చెప్పిన గొప్ప శాస్త్రం.అవి సంస్కృతంలో ఉండటంతో మనం వేరేగా అర్ధం చేసుకుంటే,పాశ్చాత్యులు ముఖ్యంగా జర్మన్లు సద్వినియోగం చేసుకుని పరిశోధనలు చేశారు.ఇప్పుడు అసలు అర్ధాలు తెల్సుకుందాం.కింఇదం= ఇప్పుడేంటి? అని రొదచేసే క్రిములు.కానీ మనం పిశాచాలు అంటున్నాం.
రాక్షస = రాత్రిపూట తిరిగే క్రిమి.రహస్యంగా కుట్టి చంపుతుంది.
గంధర్వ = సంగీతం పాడే సూక్ష్మజీవులు( దోమ, తుమ్మెద కాబోలు)
అప్సర= జలంలో సంచరించే జీవులు.వీటిని చంపడానికి తులసి,గుగ్గిలం,హింగు, సరసు అనే ఓషధులతో మంత్రప్రయోగాలు చేసేవారు.
హింగు= రాక్షసులకు క్రిములు.
రాక్షసులు= రక్తం త్రాగే క్రిములు
ఇవి సూర్య రశ్మితో చస్తాయి.
అసురాః= రోగాలను కలిగించే సూక్ష్మ క్రిములు
పిశాచం= మాంసాన్ని తినే క్రిములు అంటే చర్మరోగాలు,వ్రణాలు
దుర్నామ= పచ్చిమాంసాన్ని తినే క్రిమి
అప్సరసలు= వాసన పై ఆధారపడే జీవులు
గంధర్వులు= రూపసౌందర్యాల్ని ఆశ్రయించే క్రిములు.ఇవన్నీ అధర్వవేదం లో ఉన్నాయి🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి