సుప్రభాత కవిత : - బృంద
కోటి ఆశలు తీర్చే 
కోరిన క్షణాలు  ఏవో 
దూరంగా కనిపించి 
ఊరించే సమయం.....

కావాలన్న మార్పును 
తేవాలని తూర్పునకు 
రానున్న వేకువకు 
విన్నపాలు వినిపించే సమయం

కమ్ముకున్న కలతలు 
చిమ్మ చీకటంటి చిక్కులను 
పో పొమ్మని తరిమేసి 
కమ్మని కబురేదో తెచ్చే సమయం
 
కుదురు లేని మనసులో 
ఎదురు చూసే ఉన్నతులతో 
చెదిరిన  ప్రశాంతతను 
తెచ్చి దోసిట పోసే సమయం

వలసినది వచ్చునో లేదో 
కలసినది ఉండునో లేదో 
తెలిసినది నిజమో కాదో 
సందేహములు తీరే సమయం

చెరపలేని సుఖమునిచ్చి 
తరిగిపోని  సౌఖ్యమిచ్చి 
కరిగిపోయే కాలగమనంలో 
తరలి వచ్చే వేకువ సమయానికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు