ఓ మనిషి.... ఇదేనా...! : - కోరాడ నరసింహా రావు!
 మనము - మనది అనుకు న్నన్నాలు.... 
  కూడు, గుడ్డ, గూడు తెలియక పోయినా... 
 దొరికింది తింటు కలిసి, మెలిసి వుంటు.... 
  సహ జీవనంతో సౌఖ్యా నందంగానే బతికాం...! 
స్థిర నివా సాలతో తృణ ధాన్యోత్పత్తితో వృత్తుల నేర్పరచుకుని ...
  కులాలను సృష్ఠించుకున్న పిదప... 
మేము మాది ... 
   మీరు మీది...అంటూ
  అక్కడితో ఆగక...
   నెను నాది అనటం మొదలు పెట్టి...
 చివరికి అంతా నాదే...
అన్నీ నావే అనుకున్న దగ్గరనుండే.... 
  వచ్చింది తంటా ...! 
  
దోచుకోవటం - దాచుకోవటం మరిగినాడు... !! 
అధికారం చలాయించటం కోసం... 
  సాటి మనిషిని అణగ ద్రొక్కటం మొదలు పెట్టాడు...! 
   
అది మొదలు.... మనిషి కి-మనిషికి మధ్య యుద్దం మొదలయింది...! 
  అది... రెండు ప్రపంచ యుద్దాల చేదు అనుభవాలను మిగిల్చినా... ఈ మనిషికి బుద్ది రాలేదు...! 
  వడి వడి గా మూడో ప్రపంచ యుద్దం వైపు అడుగులు వేస్తున్నాడు...!! 
 ఓ మనిషి...! 
  ఇదేనా నీ విజ్ఞత...!?

కామెంట్‌లు