విటమిన్లు -డా. కందేపి రాణీప్రసాద్
విటమిన్లండి విటమిన్లు
విలువ కలిగిన విటమిన్లు

క్యారెట్లు, కోడిగుడ్లు తింటే
కంటి చూపు మెరుగవును
ఎ విటమిన్ లభించును

విటమిన్లండి విటమిన్లు
విలువ కలిగిన విటమిన్లు

కాయలు కూరలు తింటే
కండరాలకు పటుత్వం కలుగును
బి విటమిన్ లభించును

విటమిన్లండి విటమిన్లు
విలువ కలిగిన విటమిన్లు

నిమ్మ, నారింజ పండ్లు తింటే
నిగనిగల చర్మం వచ్చును 
సి విటమిన్ లభించును

విటమిన్లండి విటమిన్లు
విలువ కలిగిన విటమిన్లు


కామెంట్‌లు