ఆమె గాయపడిన విప్లవo : - డా. ధనాశి ఉషారాణి -\నూతన ప్రక్రియల రూపకర్త -తిరుపతి జిల్లా భాకరాపేట
(మహిళా దినోత్సవం సందర్భంగా.... ) 

కత్తులు  దూస్తున్న కాలకెరటం సుడిగాలిలో
అలుపెరుగని పోరాటంతో  నిలిచినది ఆమె
కన్నీటి సుడిగాలిలో ఉలిక్కిపడుతూ నిలిచింది ఆమె 
అనాథగా చిత్తు చేయబడుతున్న  త్యాగమే ఆమె
విసిరే అసూయ తూటాలుకు విసిగిపోయిన పసి హృదయo ఆమె
కుట్రలు కుతంత్రాలు లోగిలిలో కరిగిన కవి హృదయo ఆమె 
అలుపెరుగని కాల గమనంలో ఎదురీత ఆమె
అధికార డాబులో బలిపశువు ఆమె
శత్రువును  మన్నించే మమతల కోవెల ఆమె
కలల తోరణాలు కోటను నిర్మించే రారాణి ఆమె
బావి జగతికి భవితవ్యo ఇచ్చే మణిదీపము ఆమె 
మాసిపోనీ  హృదయానికి నిలువెత్తు రూపము ఆమె
పురిటి నొప్పుల నిప్పుల కొలిమిలో జీవితం ఇచ్చేది ఆమె
జగతికి నిండు పున్నమి  వెలుగు ఆమె
శత్రువు మీద విజయo పూరించే సమరభేరి ఆమె 
జగతిలో నిలిచిన మహిళ శక్తిరూపు స్త్రీ రూపం
సమస్త ప్రపంచానికి అభయహస్తము   మహిళ చైతన్యం 
ప్రతి మదిలో మెదిలో అమృత భావము స్త్రీ రూపము


కామెంట్‌లు