కవిత్యo నా కీర్తి కిరీటం : - డా. ధనాశి ఉషారాణి -\ప్రముఖ రచయిత్రి -భాకరాపేట తిరుపతి జిల్లా
 సాహిత్య సింహాసనములో ఊరేగుతున్న   అక్షరము నీనై 
ప్రతి గుండె గుడిలో చెరిగిపోని కీర్తి శిఖరంగా 
అలసిపోయిన గుండెలోగిలికి సేద తీర్చే ఓ కవిత్వమా 
కన్నీటి సుడిగుండాన్నికి లేహనమై నిలిచావు
కత్తులు దూసే శత్రువుకు  సవాలై నిలిచావు
ప్రతి అణువు ఓ కవిత్వము సమీరమై విరిశావు
కలలు నిండిన నా మదిలో  కీర్తి శిఖరమై వెలిగావు
ఓ నవ్వుల సిందూరమా నా నుదుట  కీర్తిశిఖరమై నిలిచావు
భావి జగతికి సజీవ సాక్ష్యమై  నిలిచావు
చెరిగిపోని సాహితీ ప్రస్థానంకు 
నిత్య చిరునామాగా వెలిగావు
ఓ కవిత్వమా నా నిత్య ఆణిముత్యమా జోహార్ జోహార్

కామెంట్‌లు